Big Breaking : ప్రజా దీవెన రాజస్థాన్: రాజస్థాన్ రాష్ట్రంలోని ఝాలావార్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో పైకప్పు ఉన్నఫలంగా కూలిపోవడంతో నలు గురు విద్యార్ధులు దుర్మరణం పాల య్యారు. ఈ పెను ప్రమాదంలో మ రో 60 మందికి పైగా విద్యార్థులు శి థిలాల కింద చిక్కుకున్నట్టు సమా చారం.
సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఝాలా వార్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఉదయం తరగతులు జరుగుతుం డగా ఆకస్మాత్తుగా పైకప్పు కుప్ప కూలింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణిం చగా శిథిలాల కింద చిక్కుకున్న దా దాపు 60 మందికి పైగా విద్యార్థు లను రక్షించేందుకు స్థానికులు, రె స్క్యూ బృందాలు శరవేగంగా కృషి చేస్తున్నాయి. క్రేన్‌ల సాయంతో శిథి లాలను తొలగిస్తూ, చిక్కుకున్న వా రిని వెలికి తీసే ప్రయత్నాలు జరు గుతున్నాయి.
ఊహకందని విధంగా జరిగిన ఈ ఘటన స్థానికులు, అధికారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రస్తుతం సహాయక చర్యలు ము మ్మరంగా కొనసాగుతున్నాయి. కా గా ఈ ఘటనలో గాయపడిన అనే క మంది విద్యార్థులను వెంటనే స మీప ఆస్పత్రికి తరలించారు. వైద్యు లు గాయపడిన చిన్నారులకు చికి త్స అందిస్తున్నారు. వారిలో పలు వురు స్పల్ప గాయాలతో బాధప డుతుండగా, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అ వకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. స్థానిక పోలీసులు, అగ్నిమాపక బృందాలు, జాతీయ విపత్తు నిర్వహణ బృందం (ND RF) సహాయంతో శిథిలాలను తొల గించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. స్థానికులు కూడా సహాయక చర్య ల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా భ యాందోళనలను రేకెత్తించింది.