Gold Prices Drop : ప్రజా దీవెన, హైదరాబాద్: పసిడి ప్రియులకు పండగ వేళ అదిరిపో యే తీపి కబురుఅందింది. బంగా రం, వెండి రేట్లు ఒక్కసారిగా పడి పోయాయి. ఊహించని విధంగా పసిడి ధరలు తగ్గడంతో మార్కెట్ పరిశీలకులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయం గా నెలకొన్న అనిశ్చితులతో ఇటీవ ల భారీ ఎత్తున పెరిగిన బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డులు సృష్టించిన తాకిన విషయం విదిత మే. అయితే తాజాగా ఎట్టకేలకు భారీగా తగ్గి సర్వత్ర ఆసక్తి నెలకొ ల్పడం విశేషం. ఎట్టకేలకు బంగా రం, వెండి రేట్లు గరిష్ఠ స్థాయిల నుం చి పెద్ద మొత్తంలో పతనమయ్యా యి.
అంతర్జాతీయ బులియన్ మార్కె ట్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ఈ ప్ర భావం దేశీయంగానూ కనిపించింది. ధంతేరాస్, దీపావళి పర్వదినం సం దర్భంగా బంగారం కొనుగోళ్లు ఎ క్కువగా ఉంటాయి. ఈ క్రమంలో బంగారం రేట్లు దిగిరావడం గిరాకీని మరింత పెంచుతుందని చెప్పవ చ్చు. ఈ క్రమంలో హైదరాబాద్ మా ర్కెట్ లో అక్టోబర్ 19వ తేదీన 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎలా ఉన్నా యో తెలుసుకునే ప్రయత్నం చే ద్దాం.
హైదరాబాద్‌లో బంగారం ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిందని చెప్పవచ్చు. తాజాగా 24 క్యారెట్ ల మేలిమి బంగారం రేటు తులంపై ఏకంగా రూ.1910 మేర పడిపో యింది. దీంతో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,30,860 వద్దకు ది గివచ్చింది. ఇక 22 క్యారెట్ల నగల త యారీ బంగారం రేటు 10 గ్రాము లపై రూ.1750 మేర పడిపోయిం ది. దీంతో తులం పసిడి రేటు రూ. 1,19,950 వద్దకు దిగి రావడం గ మనార్హం.