Praja Deveena
Newspaper Banner
Date of Publish : 19 December 2025, 12:48 pm Posted by : praja deveena

BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, బ్యాంకు ఖాతాదారు లకు తీపికబురు, ఆర్థికపరమైన ఆ స్తుల సమస్యను పరిష్కరించేందు కు అవకాశం 

BIG BREAKING : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశంలోని సమస్త బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ఆర్ధిక శాఖ తీపి కబురు అంది స్తోంది. క్లెయిమ్ చేసుకోని ఆర్థికపర మైన ఆస్తుల కోసం 3 నెలల ప్రత్యే క కార్యక్రమం ద్వారా మీ డబ్బు,మీ హక్కు అనే కార్యక్రమంతో 2025 డిసెంబర్ 20న నల్గొండ జిల్లాలో ఉమ్మడి శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సే వల విభాగం ఆదేశాలకు అనుగు ణంగా “మీ డబ్బు, మీ హక్కు” అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకోని ఆ ర్థికపరమైన ఆస్తుల సమస్యను ప రిష్కరించేందుకు కేంద్ర ఆర్థిక మం త్రి 2025 అక్టోబర్ 4వ తేదీన గుజ రాత్‌లోని గాంధీనగర్‌ లో జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించా రు. అందులో భాగంగా ఇది 2025 అక్టోబర్ 01 నుంచి 2025 డిసెంబ ర్ 31 వరకు మూడు నెలల పాటు కొనసాగనుంది.

క్లెయిమ్ చేసుకోని బ్యాంకు పొదు పులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచు వల్ ఫండ్లు, బీమా తదితరాలను క్లె యిమ్‌ చేసుకునేందుకు వీలు క ల్పించాలన్న లక్ష్యంతో దీనిని చేప ట్టారు. జాతీయ ప్రాముఖ్యత కలిగి న ఈ కార్యక్రమం ఆర్థికపరమైన ఆ స్తులను ప్రజలు సరైన పద్ధతిలో క్లె యిమ్ చేసుకునేలా చూసుకోవాల న్న ప్రభుత్వ నిబద్ధతను అనుగు ణంగా ఉంది. ఇందులో భాగంగా ఎంసీఏ, ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏ ఐ, పీఎఫ్ఆర్‌డీఏ, బ్యాంకులు ఉ మ్మడి శిబిరాలను నిర్వహిస్తాయి.

తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రారం భమైన ఈ కార్యక్రమంలో దశలవా రీగా జిల్లా స్థాయి శిబిరాలను నిర్వ హిస్తున్నారు. 2025 డిసెంబర్ 20 న నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యా లయ ఉదయాదిత్య భవనంలో ఉ దయం 10.00 గంటల నుంచి సా యంత్రం 4.00 గంటల వరకు ఉ మ్మడి శిబిరం జరుగుతుంది. క్లెయి మ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొం దేందుకు బ్యాంకు శాఖ, భీమా సం స్థ, మ్యూచువల్ ఫండ్ సంస్థ, శిభి రంలోని స్టాక్ బ్రోకరేజీ సంస్థ, ఆన్‌ లైన్ ద్వారా స్టాక్ బ్రోకర్‌లలో దేని నై నా సంప్రదించి ఈ అవకాశాన్ని స ద్వినియోగం చేసుకోవచ్చు.

బ్యాంకుల్లో 10 సంవత్సరాలకు పై గా క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల వి వరాలు ఆర్‌బీఐ ఉద్గమ్‌ వె‌బ్‌సైట్ (https://udgam.rbi.org.in) ద్వారా పొందొచ్చు. జిల్లాలోని ఎవ రైనా ఖాతాదారులు తమ క్లెయిమ్ చేసుకొని ఆర్ధికపరమైన అంశాలను పరిష్కరించుకోవచ్చని ఆర్ బిఐ అ ధికారులు తెలియజేస్తున్నారు.