iBOMMA Site Shutdown : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పై రసీ వ్యవహారం కొలిక్కి వచ్చింది. యావత్ టాలీవుడ్ చుక్కలు చూ పిస్తున్న ఐ బొమ్మ కు పోలీసులు తె రదించారు. పైరసీ సినిమాలకు వే దికగా మారిన ఐబొమ్మ, బప్పంటీవీ సైట్లను వాటి నిర్వాహకుడు ఇమ్మ డి రవితోనే పోలీసులు క్లోజ్ చేయిం చడం కోసమెరుపు. మొత్తానికి తె లుగు సినిమా రంగానికి చీడ పీ డ లా మారిన పైరసీ వ్యవహారానికి తె రపడింది.
నా వద్ద కోట్ల మంది డేటా ఉందని, ఈ వెబ్సైట్ మీద ఫోకస్ చేయకండి’ అని గతంలో అతడు సవాల్ విసి రిన విషయం విదితమే. ఎక్కడ ఉ న్నాడో ఎవరూ గుర్తించకుండా జా గ్రత్త పడినప్పటికీ సవాల్ ను స్వీ క రించిన పోలీసులు అతడిని ఎట్ట కేలకు పట్టుకున్నారు. దీంతో ఐ బొమ్మ లాగిన్ వివరాలతో సైట్ ను మూసివేయించారు. నిందితుడి వ ద్దనుంచి స్వాధీనం చేసుకున్న వం దల హార్డిస్కులను పోలీసులు విశ్లే షిస్తున్నారు. అలాగే రవి బ్యాంక్ అ కౌంట్ వివరాలను పరిశీలిస్తున్నా రు.
నిందితుడిని కస్టడీకి తీసుకుని మ రిన్ని వివరాలు స్వీకరించాలని భావి స్తున్న నేపథ్యంలో పోలీసులు సోమ వారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటి షన్ వేసేందుకు కసరత్తు ప్రారంబిం చారు. దమ్ముంటే పట్టుకోండి అన్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆ నంద్ అభినందించారు. ‘జూన్ నుం చి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడింది. రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టు కుంది. ‘దమ్ముంటే పట్టుకోండి’ అని పోలీసులకు సవాలు విసిరి, బెదిరిం చిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేసిం ది. డీసీపీ కవిత, సీపీ సజ్జనార్ కు కంగ్రాట్స్’ అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు ఈ కేసు విచారణలో సం చలన విషయాలు వెలుగులోకి వ స్తున్నాయి. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న నిందితుడు రవి సినీ ప్ర ముఖులను బెదిరించినట్లు ఆరో పణలు ఉన్నాయి. పైరసీ కింగ్ పిన్గా ఇమ్మడి రవి మారారని గతంలో సా ఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేసి ఆ త ర్వాత నుంచి పైరసీని తన మార్గం గా ఎంచు కున్నారని సైబర్ పోలీ సులు తెలిపారు.
ఎక్స్ బెట్ బెట్టింగ్ యాప్ నిర్వా హ కులు, ఐబొమ్మ మధ్య భారీగా లా వాదేవీలు జరిగినట్లు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తో భారీగా డబ్బులు తీసుకున్నా ర ని పేర్కొన్నారు. బెట్టింగ్ కేసు దర్యా ప్తు జరుపుతుండగా ఐ బొమ్మలింక్ దొ రికిందని వెల్లడించారు. నెదర్లాం డ్, కరేబియన్ దీవులకు వెళ్లేముం దు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ నె లకొల్పారని.. వెబ్డిజైన్ సర్వీస్ ఏ ర్పాటు చేస్తున్నట్లు చెప్పి అ తర్వా త సాఫ్ట్వేర్ కంపెనీని ఆయన స్థాపిం చారని వివరించారు. ‘ఈఆన్ఇన్ఫో టెక్’ సాఫ్ట్వేర్ కంపెనీకి రవి సీఈవో గా ఉన్నారని నిన్న ట్రేస్ చేసి కూ క ట్ పల్లి రెయిన్ బోవిస్టాలో అరెస్ట్ చే శామని తెలిపారు.
