Chhattisgarh Maoist Encounter : బిగ్ బ్రేకింగ్, ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ , మావోయిస్టు అగ్రనేతల హతం
Chhattisgarh Maoist Encounter : ప్రజా దీవెన, చత్తీస్ ఘడ్: దేశంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్ర మం కొనసాగుతోంది. దేశంలో మావోయి స్టుల ఆనవాళ్లు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వా త కొనసాగుతున్న మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం నేటికీ కంటి న్యూ అవుతోంది. ఈ క్రమంలో గురువారం ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు మావోయిస్టులపై జరిపిన భారీ ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున ప్రా ణనష్టం జరిగింది.
గరియాబంద్ జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, వరంగల్‌కు చెంది న మనోజ్ అలియాస్ మోదెం బాల కృష్ణతో పాటు 10 మంది మావో యిస్టులు మృతిచెందారు. కాగా మనోజ్‌పై గతంలో రూ.2 కోట్ల రివా ర్డు ప్రకటించగా, ఆయనను మావో యిస్టు అగ్రనేతల్లో ఒకరిగా పోలీసు లు భావించారు. అదేవిధంగా ఒడి శా స్టేట్ మావోయిస్టు పార్టీ కార్యద ర్శి ప్రమోద్ యారఫ్ పాండు కూడా హతమైనట్లు విశ్వసనీయ సమాచా రం.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా ఎదు రుకాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ పూర్తయ్యాకే మృతుల సంఖ్య, వారి గుర్తింపుపై పూర్తి స్పష్టత వస్తుందని భద్రతా దళాలు వెల్లడించాయి.ఈ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు గ ట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.