Nagarjuna Sagar Water Release : బిగ్ బ్రేకింగ్, నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
Nagarjuna Sagar Water Release : ప్రజా దీవెన, నాగార్జునసాగర్: వ్య వసాయ రంగానికి కాంగ్రెస్ పార్టీ ప్ర జా ప్రభుత్వం పెద్దపీట వేసిందని భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి నల్లమాద ఉత్తమ్ కు మార్ రెడ్డి పేర్కొన్నారు. మొదటి పంచవర్ష ప్రణాళికలోనే తొలిప్రధాని నవ భారత నిర్మాత పండిట్ జవహ ర్ లాల్ నెహ్రు ఆధునిక దేవాలయా లకు అంకురార్పణ చేశారని, నెహ్రు వేసిన పునాది ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వర ప్రధాయని గా మారిందని గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలు బలిదానం చేసిన దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా ప్రారంభమైన నా గార్జునసాగర్ ప్రాజెక్టు అని వివరిం చారు. మంగళవారం ఆయన జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి ని విడుదల చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదట ఖరీఫ్,రబీ సీజన్ లతో పా టు ప్రస్తుత ఖరీఫ్ కు సమృద్ధిగా కృ ష్ణా జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయన్నారు. ఇది రైతుపక్షపాత ప్రభుత్వమని, నిర్దిష్ట షెడ్యూల్ కు ముందే ఎడమకాలువ ద్వారా మూ డు వేల క్యూసెక్కుల నీటిని విడు ద ల చేసి రైతాంగానికి ప్రభుత్వం బా సటగా నిలిచిందని చెప్పారు. ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్కల నే తృత్వంలో రాష్ట్రంలో ధాన్యం దిగు బడి రికార్డు సృష్టించిందని వివరిం చారు.
సమిష్టి నిర్ణయాలతో పోయిన సం వత్సరం ఖరీఫ్,రబీ సీజన్ లు కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించామని, ఇది యా వత్ భారతదేశము లోనే అరుదైన రికార్డ్ సృష్టించిందన్నారు. నాగార్జు న సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు విస్తీర్ణం 22.12 లక్షల ఎకరాలు కాగా తొలి ప్రధాని నెహ్రూ గారితో పిలువ బడు తున్న కుడి కాలువ ఆయకట్టు 11. 74 లక్షల ఎకరాలని, మలి ప్రధాని దివంగత లాల్ బహుదూర్ శాస్త్రి పేరుతో పిలువబడుతున్న ఎడమ కాలువ విస్తీర్ణం 10.38 లక్షల ఎకరా లని చెప్పారు.
అందులో తెలంగాణా భూభాగంలో 6.30 లక్షల ఎకరాలకు ఆంద్రప్రదేశ్ భూభాగంలో 4.08 లక్షల ఎకరాల కు సాగునీటితో పాటు త్రాగు నీరు అందిస్తున్న అతి పెద్ద ప్రాజెక్టు అం టూ కితాబునిచ్చారు. జిల్లాల వా రిగా చూస్తే నల్లగొండ జిల్లాలో 1.46 లక్షల ఎకరాలకు, సూర్యపేట జిల్లా లో 2.30 లక్షల ఎకరాలకు ఖమ్మం జిల్లాకు 2.54 లక్షల ఎకరాలకు సా గునీరు అందుతుందన్నారు.1955 డిసెంబర్ 10 న తొలి ప్రధాని పం డిట్ జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న ఈ ప్రాజెక్టు 1967 నాటికి స్పిల్ వే పను ల పూర్తి చేసుకుందని తెలిపారు.
అదే సంవత్సరంలో దివంగత ప్రధా ని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరి గిందన్నారు.
1974 నాటికి క్రస్ట్ గేట్లు పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీటిని నిలువ చే యడం జరిగిందని, 2005 నాటికి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకున్నామని, ఎడమ కాలువ పొడవు 180.75 కిలో మీటర్లు కాగా 21 వ బ్రాంచ్ కేనాల్ పొడవు 112.02 కిలో మీటర్లు అని, తెలం గాణా భూబాగంలో 15,642 కిలో మీటర్లు విస్తరించి ఉన్నదని వివరిం చారు. అరుమార్లు శాసనస భ్యు డిగా ఒక మారు లోకసభ సభ్యుడి గా కృష్ణా పరివాహక ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించడం అదృష్టం గా భావిస్తున్నానని పేర్కొన్నారు.
రైతాంగం సమస్యలు తెలిసిన వాడి గా రైతులకు సమృద్ధిగా సాగు నీరు అందిస్తామని, కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వ హయాంలో సమృద్ధిగా సాగు నీరు అందిస్తామన్నారు. 30 వేల క్యూసెక్కుల నీటి వినియోగంతో సాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుం డి 7 యూనిట్స్ లలో 700 మేఘ వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోం దని, ఎడమ కాలువ నీటి విని యో గంతో 2 యూనిట్స్ లలో 60 మేఘ వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుం దన్నారు. కార్యక్రమంలో స్థానిక శా సనసభ్యులు కుందురు జయవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, శాసనమం డలి సభ్యులు శంకర్ నాయక్ తది తరులు ఉన్నారు.
Opening NagarjunaSagar project crust gates pic.twitter.com/0jylb0FFBU
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) July 29, 2025