Operation Muskaan : బిగ్ బ్రేకింగ్, ఆపరేషన్ ముస్కాన్ లో నల్లగొండ జిల్లా రికార్డు, భారీ స్థాయిలో బాల కార్మికుల విముక్తి
Operation Muskaan : ప్రజా దీవెన, నల్లగొండ: పలకా బల పం పట్టి బడిబాట పట్టాల్సిన బా ల లను వెట్టిచాకిరీతోనే బంధీ అయి పోతున్న పసిబాల్యాన్ని తమ చేతు లతో ఒడిసి పట్టుకుని వారిని విము క్తుల్ని చేశారు నల్లగొండ జిల్లా పోలీ సులు. ఒక్కరుకాదు, ఇద్దరుకాదు ఏకంగా 106 మంది పసిపిల్లల భవి తవ్యం అంధకారంలో మునిగిపో కుండా సరికొత్త జీవితాలు అందిం చారు.
కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం రాష్ట్ర పోలీస్ శాఖ నేతృత్వంలో ప్రతీ ఆరు నెలలకొసారి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో బాలకార్మికులు, వ్యభిచార కూపం లో చిక్కుకుపోయిన మైనర్లను, వీ ధిబాలలను, ఇటుకబట్టీలో నిర్బంధ కార్మికులుగా ఉన్నవారిని, ముష్టి మాఫియా చేతుల్లో బందీలుగా ఉన్నవారిని,ఇండస్ట్రియల్ కంపె నీల్లో పని చేసే వారిని కాపాడేం దుకు ఈ కార్యక్రమాలను చేపడు తున్న విషయం అందరికీ తెలిసిం దే.
నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు సబ్ డివిజన్ లలో ఎస్పీ శరత్ చం ద్ర పవార్ నేతృత్వంలో పోలీస్ శా ఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపా ర్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జి ల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివి ధ డిపార్ట్మెంటు అధికారుల సమ న్వయంతో టీమ్ లుగా ఏర్పడి ఒ క్క జూలై నెలలోనే 90 కేసుల్లో 10 6 మంది పిల్లలను రెస్యూ చేయడం జరిగింది.
వీరిలో 94 మంది బాలలు 12 మం ది బాలికలు వీరంతా ఎక్కువగా ఇ తర రాష్ట్రాలు బీహార్, చత్తీస్గడ్, ఒ రిస్సా, యూపీ మరియు ఆంధ్రప్ర దేశ్ కి చెందిన వారు కావడం గమ నార్హం.
*బాలకార్మికులతో పనులపై కఠిన చర్యలు….* నల్లగొండ జిల్లా లో బాలల హక్కులను కాపాడాల్సి న బాధ్యత మనందరిపైనా ఉన్నద ని,బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కో సం బాధ్యతాయుతంగా కృషి చే యాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. బాల కార్మికులకు చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.వీధి బాలల ను, బాల కార్మికులను చూసినప్పు డు, డయల్- 100 లేదా 1098 లే దా స్థానిక పోలీస్ వారికి సమాచా రం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజ లకు సూచించారు.