Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు, బాలికపై రేప్ కేసు లో యాభై ఏళ్ల కఠిన కారాగార శిక్ష
Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు (POCSO Cour t) మంగళవారం సంచలన తీర్పు వె లువరించింది. పోక్సో కేసులో తిప్ప ర్తికి చెందిన మహమ్మద్ ఖయ్యూం ను దోషిగా నిర్ధారించిన నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు ఈ మేరకు సం చలన తీర్పు వెలువరించింది. ఓ బాలికపై లైంగిక దాడి కేసులో నల్ల గొండ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలు వరించడం సంచలనం రేకెత్తించింది. ఇరువైపు వాదనలు పరిశీలించిన న్యాయస్థానం ఇన్చార్జ్ జడ్జి రోజార మణి నిందితుడికి 50 ఏళ్లు జైలు శిక్ష విధించారు.పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
2021లో తిప్పర్తిలోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలిక ఇంటికి వస్తుండగా షేక్ మ హమ్మ ద్ ఖయ్యూం బలవంతంగా తన బండిపై ఎక్కించుకునాడు. ఓ పాడుబడ్డ ఇంటికి తీసుకెళ్లి లైంగి క దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అ ప్పట్లో కేసు నమోదు చేశారు. మూ డున్నర సంవత్సరాల పాటు సాగి న విచారణ అనంతరం నేరం రుజు వు కావడంతో కోర్టు మంగళవారం తుది తీర్పును వెల్లడించింది.
ఇదిలా ఉండగా కోర్టు వెలువరిం చిన తీర్పు కు సంబంధించి అత్యా చార కేసులో 20 ఏళ్లు, పోక్సో కేసు లో 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ కేసులో ప దేళ్ళు, సెక్షన్ 506(మైనర్ బాలికపై బెదిరింపులు) కేసులో మరో ఏడాది శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచల న తీర్పు వెల్లడించింది. 2021లో తి ప్పర్తి పీఎస్ పరిధిలో దళిత మైనర్ బాలికపై మహమ్మద్ ఖయ్యూం మై నర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Shar ath Chandra Pawar) నేతృత్వం లో న్యాయస్థానికి సరైన సైంటిఫిక్ ఎవిడెన్స్ సమర్పించడంతో నింది తుడు శిక్ష నుంచి తప్పించుకోలేక పోయాడు.