Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking News : బిగ్ బ్రేకింగ్, ముగ్గురు చిన్నారులు మృత్యువాత

Big Breaking News : ప్రజా దీవెన , రైల్వే కోడూరు : ఆడుతూ పాడుతూ ఆహ్లాదంగా గడుపుతున్న ఆ చిన్నారుల జీ వితాలు చిదిమాయి. అందరూ కలి సి ఆటపాటలతో సంతోషంగా గడు పుతున్న ఆ చిన్నారుల కుటుంబం లో విషాదఛాయలుముకున్నాయి.

ఆ చిన్నారులు ఆడుకుంటూ ఓ నీ టి గుంత దగ్గరకు వెళ్ళి ప్రమాదవ శాత్తు ముగ్గురు చిన్నారులు కూడా నీటి గుంటలో పడి మృత్యువాత పడ్డారు. ఆడుకోవడానికి బయట కు వెళ్లిన చిన్నారులు అటు నుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవ డంతో చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీ రుగా విలపిస్తున్నా రు. నీటికుంట లో దిగిన ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని చిట్వేలి మండలం ఎం రాచపల్లిలో చోటుచేసుకుంది.

స్థానికంగా మట్టి కోసం తవ్విన గుంతలో ఇరుక్కుపోయి విజయ్ (6), దేవాన్ష్ (6), యశ్వంత్ (7) మృతిచెందారు.శుక్రవారం ఇంటి పరిసర ప్రాంతంలో మట్టికోసం త వ్విన గుంట వద్దకు ముగ్గురు చి న్నారులు ఆడుకోవడానికి వెళ్ళా రు. సాయంత్రం వేళ ఆడుకుంటూ ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు ఇలా మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. గ్రామంలో మట్టికోసం ఇటీవల గుంత తవ్వగా ఆతవ్విన గుంతలో గత వారం కురిసిన వర్షానికి నీరు నిండటంతో నీటిలో ఆడుకుంటూ చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లలు రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో గాలించారు. చివరకు నీటి గుంత లో వెతకగా చిన్నారులు ఇరుక్కు పోయి విగత జీవులుగా కనిపించా రు.

వెంటనే వారిని బయటకు తీసి స్థా నిక ఆసుపత్రికి తరలించగా అప్ప టికే వారు చనిపోయారని వైద్యు లు ధ్రువీకరించారు. దీంతో గ్రామం లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వి షయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు.