Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ మేడిపల్లిలోని శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్నకి సంబం ధించిన క్యూ న్యూస్ కార్యాలయం పై మరోమారు మూకుమ్మడి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవితపై మల్లన్న తాజాగా చే సిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన గా జాగృతి కార్యకర్తలు క్యూ న్యూ స్ కార్యాలయంపై దాడికి దిగారు. ఊహించని విధంగా జరిగిన ఈ దా డి సమయంలో తీన్మార్ మల్లన్న కా ర్యాలయంలోనే ఉండడం గమనా ర్హం.
కవిత బీసీ ఉద్యమాన్ని తీన్మా ర్ మల్లన్న తప్పుబట్టిన విషయం విది తమే.మల్లన్న కార్యాలయంలో ఉ న్న ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చే యడంతో పాటు భౌతిక దాడులకు దిగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రి క్తత పరిస్థితులు నెలకొన్నాయి. దా డికి దిగిన జాగృతి సభ్యులు వెంట నే బయటకి వెళ్లకపోతే కాల్పులు జ రుపుతామని మల్లన్న గన్‌మెన్ హె చ్చరించినా కార్యాలయం నుంచి జాగృతి సభ్యులు వెళ్లకపోవడంతో అనివార్యంగా గాల్లోకి 5 రౌండ్ల కా ల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో జాగృతి సభ్యుడు సా యి అనే యువకుడికి గాయాల య్యాయి. వెంటనే యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాయికి ఆస్పత్రిలో చికిత్స కొనసా గుతోంది. ఆయన చేతి నుంచి బు లెట్ వెళ్లినట్లు వైద్యులు గుర్తించా రు.
అయితే తీన్మార్ మల్లన్న కార్యాల యంలో ఎక్కువగా రక్తం మరకలు కనిపించాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావర ణం నెలకొనడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. న్యూస్ ఆఫీస్‌పై దాడి జరగడంతో సిబ్బంది భయాందోళనకు గుర య్యారు. జాగృతి కార్యకర్తలు కఠిన చర్యలకు పాల్పడే అవకాశం ఉంద ని తెలియడంతో తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరు పుతున్నారు.
జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘా లు ఈ దాడిని తీవ్రంగా ఖండించా యి. మీడియా సంస్థలపై దాడులు చేయడం సరికాదని తీన్మార్ మల్ల న్న అన్నారు. రాష్ట్రంలో జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు శాం తి భద్రతలకు భంగం కలిగిస్తున్నా రని తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ న్యూస్‌కి, తన కి భద్రత కల్పించాలని ఈ సంద ర్భంగా పోలీసులను తీన్మార్ మల్ల న్న కోరారు.
Jagruthi leaders attack on mlc theanmar mallanna Qnews office pic.twitter.com/dKrSsTE9CC
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) July 13, 2025