Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: ఇండోనేషియా న్యాయస్థానంలో ఇండియన్స్ కు షాక్ తగిలింది.
డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ము గ్గురు భారతీయులకు ఇండోనేషి యా న్యాయస్థానం మరణశిక్ష వి ధించే అవకాశం ఉందని అంతర్జాతీ య మీడియా కథనాల మేరకు వెల్ల డవుతోంది. ఆయా ప్రసార మాధ్య మాల్లో విస్తృత స్థాయిలో ప్రసార మవుతోన్న కథనాల మేరకు గత ఏడాది జులైలో సింగపూర్ జెండా కలిగిన ఓడలో డ్రగ్స్ తరలిస్తున్న ట్లు సమాచారం అందడంతో తని ఖీలు నిర్వహించి 106 కిలోల మా దకద్రవ్యాలను స్వాధీనం చేసుకు న్నట్లు ఇండోనేషియా పోలీసులు ప్రకటించారు. మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న తమిళనా డుకు చెందిన రాజు ముత్తుకుమా రన్, సెల్వదురై దినకరన్, విమల కందన్‌లను అరెస్టు చేసినట్లు కూ డా వెల్లడించారు.
త్వరలో ఈ ము గ్గురు నిందితులతో పాటు ఓడ కెప్టె న్‌కు అక్కడి కోర్టు మరణశిక్ష విధిం చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ 15న తీర్పు వెలువడే అవకాశం ఉందని వీరి తరఫున భారతీయ న్యాయ వాది జాన్ పాల్ కేసును వాదిస్తు న్నారు. అయితే కెప్టెన్‌కు తెలియ కుండా ఓడలో ఇంత పెద్ద మొత్తం లో మాదకద్రవ్యాలు తరలించడం సాధ్యం కాని విషయమని, కుట్ర పన్ని అమాయకులైన ముగ్గురిని ఈ కేసులో ఇరికించారని న్యాయ వాది జాన్ పాల్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో అసలైన నేరస్థులు తప్పించుకోకుండా చూ డాలని ఆయన కోరినట్లు సమాచా రం.