Nalgonda School Bus Accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కేంద్రం లో దారుణం , స్కూల్ బస్సు కింద పడి చిన్నారి దుర్మరణం
Nalgonda School Bus Accident : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ప్రైవేటు స్కూల్ బస్సు కిందపడి చి న్నారి విద్యార్థిని మృత్యువాత ప డింది. పాఠశాల యాజమాన్యం, డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ చిన్నారి అసు వులు బాసింది. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, కు టుంబ సభ్యుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
కనగల్లు మండలం తొరగల్లు గ్రామా నికి చెందిన చింతపల్లి రాధిక సైదు లు దంపతుల కుమార్తె చింతపల్లి జశ్విత (5) నల్లగొండ పట్టణంలోని మాస్టర్ మైండ్ పాఠశాలలో ఎల్ కే జీ చదువుతోoది. గత వారం రోజు లుగా జశ్వితకు తీవ్ర జ్వరం రాగా పాఠశాలకు హాజరు కాలేదు. జ్వరం తగ్గడంతో శుక్రవారం జశ్విత తల్లి రాధిక జశ్వితను యధావిధిగా గ్రా మానికి వస్తున్న మాస్టర్ మైండ్ పా ఠశాలకు చెందిన బస్సులో పాఠశా లకు పంపించింది. విద్యార్థులతో ప ట్టణంలోని మాస్టర్ మైండ్స్ పాఠశా లకు చేరుకున్న బస్సులోని విద్యా ర్థులు అంత బస్సు దిగి తరగతి గది వైపు వెళ్లారు. చివరగా వెళ్లిన జశ్వి త బస్సు ముందు నుంచి వెళ్తుండ గా నిర్లక్ష్యంగా ముందు చూపు లేకుండా డ్రైవర్ బస్సును కదపడం తో చక్రాల కింద పడడంతో తలపై నుంచి కైరు ఎక్కడంతో జశ్విత అక్కడికక్కడే మృతి చెందింది.
వెంటనే పోలీసులు ఘటన స్థలా నికి చేరుకొని జస్విత మృతదే హా న్ని ప్రభుత్వ ఆసుపత్రి లోనీ మార్చు రీకి తరలించారు. కుటుంబ సభ్యు లకు, బంధువులకు విషయం తెలి యడంతో మార్చురీకి చేరుకొని మృ తదేహాన్ని చూసి కన్నీటి పర్యంత మయ్యారు. కుటుంబ సభ్యుల రో ధనలతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాం గణం మారుమోగింది. మార్చురీలో మృతదేహాన్ని సందర్శించిన డీఈ వో బొల్లారం బిక్షపతి మాట్లాడుతూ స్కూలు బస్సు డ్రైవర్ పాఠశాల ని ర్లక్ష్యంతోనే విద్యార్థిని మృతి చెంది నట్లు తెలిసిందన్నారు. పాఠశాలల ప్రారంభంలోనే అన్ని పాఠశాలల యాజమాన్యాలకు డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని ఇలాంటి ఘట నలు జరగడం బాధాకరమన్నారు.
నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని నిర్లక్ష్యంగా వ్యవ హరించిన వారికి కేసులు నమోదు చేస్తామన్నారు.
*పాఠశాల ఎదుట విద్యార్థి సం ఘాల ధర్నా..* నల్లగొండ పట్టణం లోని దేవరకొండ రోడ్ లో ఉన్న మా స్టర్ మైండ్స్ పాఠశాల నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం జరి గిందని విద్యార్థి సంఘాల నాయకు లు పాఠశాల ఎదుట ధర్నా నిర్వ హించారు. అందుకే ఏబీవీపీ డివై ఎ ఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వేరు వేరుగా ధర్నా నిర్వహించి మృతి చెందిన విద్యార్థిని తల్లిదండ్రులకు ఆవేదనను అర్థం చేసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
విద్యాశాఖ అధికారులు, ఆర్టీవో అ ధికారులు పాఠశాల బస్సులు పా ఠ శాలల నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్య వహరిస్తుండడంతో పాటు పర్యవేక్ష ణ లోపంతో ఇలాంటి ఘటనలు చో టు చేసుకుంటున్నాయని ఆరోపిం చారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.