బిగ్ బ్రేకింగ్, ఆత్మకూరులో పట్టపగ లే మహిళ అత్యంతదారుణ హత్య
Big Breking Crime : ప్రజా దీవెన, సూర్యాపేట: సమా జంలో వికృత చేష్టలు విశృంఖలమ వుతున్నాయి. ప్రతిరోజూ నిద్రలేచిందే మొదలు ఏదో ఓ మూల ఘో ర సంఘటనలు వెలుగు చూస్తుంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అదే కోవలో సూర్యాపే ట జిల్లాలో పట్టపగలే పెనుసంచలన ఘటన చోటు చేసుకుంది. రద్దీ ప్రాంతంలో అందరు చూస్తుండగానే నడివీధిలో గుర్తుతెలియని దుండగులు మహిళగొంతును కోశారు. ఆమె మెడను సగం వరకు కోసేసి పరార య్యారు.
ఈ విషాద దుర్ఘటన సూర్యాపేట జి ల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఏ పూర్ గ్రామంలో మంగళవారం మ ధ్యాహ్నం జరిగింది. హతురా లిని గ్రామానికి చెందిన కొరివి భిక్షవమ్మ (40)గా స్థానికులు గుర్తించ గా మ హిళపై దుండగులు దాడి చేసిన క త్తి సైతం రెండు ముక్కలై ఘటనాస్థ లం లోనే పడిపోయింది.
కాగా, కొంతమంది వ్యక్తులు నడిరోడ్డుపై భిక్ష వమ్మ గొంతుకోసి పరా రయ్యారయి నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. విషయం తెలుసు కున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంబిం చా రు. ఇదిలా ఉండ గా హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి ఆత్మకూరులో పట్టపగలు జరిగిన మహిళహత్య సం చ లనం సృష్టించింది.