BJP : ప్రజా దీవెన, నల్గొండ:నల్గొండ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక గత కొన్ని రోజులుగా ఉత్కంఠ భరితంగా సాగింది..జిల్లా నుండి అధ్యక్ష పీఠం కోసం సీనియర్ నాయకులు తీవ్రంగా పోటీ ఉన్నపటికీ మెజారిటీ సభ్యుల అభిప్రాయాల మేరకు నాగం వర్శిత్ రెడ్డినే రెండవసారి బీజేపి జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తు ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి..యెండల లక్ష్మీనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు..
తెలంగాణలో బిజెపి బలపడుతున్న
నేపథ్యంలో రానున్న ఎన్నికలలో బీజేపి అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్ళడానికి యువతకు ప్రాధాన్యత కల్పించాలనే భావనతో వర్షిత్ రెడ్డి కే పార్టీ పగ్గాలు ఇస్తే బాగుంటుంది అని పలువురి అభిప్రాయం వ్యక్తం కావడంతో మళ్ళీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు…చిన్న వయస్సులోనే పార్టీ జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో పార్టీని ముందుకు తీసుకెత్తు ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడుగా నిలబడి అందరి చేత మన్ననలు పొందారు..
ఈ క్రమంలో రెండో సారి అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడంతో పార్టీ కార్యకర్తలు, నాయకుల నుండి నాగం వర్షిత్ రెడ్డికి అభినందనలు వెలువెత్తుతున్నాయి