Revanth reddy: రాజ్యాంగాన్ని రాసిరంపాన పెట్టేందు కు బిజేపీ, బిఆర్‌ఎస్ మిలాఖత్
దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంచు న ఉందని, రాజ్యాంగాన్ని రాసిరం పాన పెట్టేందుకు బిజెపి బిఆర్ఎస్ లు మిలాఖత్ అయ్యాయని ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా మా ర్చే విషయంలో వారి ద్దరిదీ ఒకే విధానమని దుయ్యబట్టారు.
ఇష్టానుసారంగా మార్చే విషయం లో వారిద్దరిదీ ఒకే విధానం
బిజెపి,బిఆర్ఎస్ లకు వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే
తెలంగాణను ప్రధాని పార్లమెంటు సాక్షిగా అపహాస్యం చేశారు
ఎన్నికలొచ్చేసరికి ఇప్పుడొచ్చి ఓట్లు ఎలా అడుగుతారు
తెలంగాణకు ఇచ్చేవి ఇవ్వరు, ఉన్నవి ఊడపీకుతారు
బీజేపీ నేతల నోరునిండా అబ ద్ధాలే, ట్విటర్ టిల్లూ కేటీఆర్ ప్రశ్నించరెoదుకు
జగిత్యాల, సిరిసిల్ల కాంగ్రెస్ సభ ల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రజా దీవెన, కరీంనగర్: దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంచు న ఉందని, రాజ్యాంగాన్ని రాసిరం పాన పెట్టేందుకు బిజెపి బిఆర్ఎస్ లు మిలాఖత్ అయ్యాయని ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth reddy) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా మా ర్చే విషయంలో వారి ద్దరిదీ ఒకే విధానమని దుయ్యబట్టారు. బిజె పి(BJP),బిఆర్ఎస్(BRS) లకు వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని హెచ్చరించారు. తెలంగాణను పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ అపహాస్యం చేశారని, ఎన్నికలొచ్చే సరికి ఇప్పుడొచ్చి ఓట్లు ఎలా అడు గుతారని ప్రశ్నించారు. తెలంగాణ కు ఇచ్చేవి ఇవ్వరని, ఉన్నవి ఊడ పీకుతారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతల నోరునిండా అబద్ధాలేనని, మరి వారి వ్యవహార శైలిని ట్విటర్ టిల్లూ కేటీఆర్ ప్రశ్నించరెoదుకని ఎద్దేవా చేశారు.
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని జగి త్యాల జిల్లా రాజారాంపల్లిలో, రాజ న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్ర వారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభల్లో సీఎం రేవంత్ ప్రసంగించారు. గత ఏడాది డిసెంబ రులో జరిగిన సెమీఫైనల్స్‌లో బిల్లా, రంగాలను ఓడించామని, ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్స్‌లో మోదీ, అ మిత్‌షాలను ఓడిస్తామని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్‌లో బీఆర్‌ఎస్‌ను బొందపెట్టామని, లోక్ సభ ఎన్నికల ఫైనల్స్‌లో బీజేపీని ఓడించేందుకు కంకణబద్ధులు అవుతామని కాంగ్రెస్ క్యాడర్ కు, ప్రజలకు పిలుపునిచ్చారు. బిల్లారం గాలంటే ఎవరో కాదు హరీశ్‌రావు, కేటీఆర్ అని, బీఆర్‌ఎస్ అంటే బిల్లా రంగా సమితి అని ఎద్దేవా చేశారు.
మోదీ, అమిత్‌షాలను మనువాద సిద్ధాంతం ఆవహించిం దని, ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో గుజరాత్ రాష్ట్రానికి బుల్లెట్ ట్రెయిన్ తీసుకువెళ్లారని, సబర్మతి రివర్ ఫ్రంట్ చేపట్టారని, గేట్ సిటీ నిర్మించారని, లక్షల కోట్ల నిధులను తరలించుకుపోయారని వివరించారు. తెలంగాణకు మాత్రం నిధులు, ప్రాజెక్టులు ఇవ్వరని, మం జూరైన ప్రాజెక్టులను కూడా రద్దు చేస్తారని, గుజరాత్‌లో ఉన్నోళ్లే మనుషులా తెలంగాణలో ఉన్నోళ్లు మనుషులు కాదా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలపై బీజేపీ సార థ్యంలోని కేంద్రప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని, రాష్ట్రా నికి పెద్ద గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. కరీంనగర్‌లో పోటీ పడుతున్నది కొత్త వాళ్లేమీ కాదని, గతంలో ఎంపీలుగా పని చేసిన వినోద్‌రావు, బండి సంజయ్‌లని ఒకరు అపర మేధావి కాగా, మరొకరు అరగుండు మేధావి అని రేవంత్ పేర్కొన్నారు.
పదేళ్లు వీరి ప్రభుత్వాలే అధికారం లో ఉన్నాయని, తెలంగాణకు అవి చేసిన ద్రోహాన్ని చూశామని, రాష్ట్రా న్ని ఎలా దోచుకున్నారో చూశామని తెలిపారు. తెలంగాణకు హక్కులు, నిధులు ఇవ్వకపోగా నరేంద్రమోదీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ(Telangana) ఏర్పాటు పక్రియను త ప్పుపట్టి అవమానించారని రేవంత్ ఆరోపించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని, పార్లమెంట్ తలుపు లు మూసి తెలంగాణ బిల్లు అమో దించారని మోదీ చేసిన వ్యాఖ్య లను గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటునే అవమానించిన బీజేపీ పార్టీకి చెందిన బండి సంజయ్, అరవింద్‌లకు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను ఉద్దేశించి కోనసీమ నుం చి చిత్రసీమ వరకు ప్రపంచంలో అన్నింటి గురించీ మాట్లాడే ట్విట్టర్ టిల్లు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చడాని కి నరేంద్రమోదీ బీజేపీ కుట్ర చేస్తుం టే ఎందుకు ప్రశ్నించడం లేదని సూటిగా అడిగారు.
2028 అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్‌ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వనని, ఆయనను ఓడిస్తామని ప్రకటించారు. రాజ్యాం గాన్ని రద్దు చేయాలనే విషయంలో కేసీఆర్, నరేంద్రమోదీలది ఒకే విధా నమన్నారు. 2022 ఫిబ్రవరిలో కేసీ ఆర్ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని చెప్పా రని గుర్తు చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర చేస్తుంటే కొడుకు కేటీఆర్(KTR) కారు కరాబు అయ్యిందని అంటు న్నాడని, షెడ్డుకు పోయిన కారు తిరిగిరాదని, తూకానికి అమ్మాల్సిం దేనన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒకటి రెండు సీట్లు గెలిస్తే మోదీకి అమ్మే అలోచన కేసీఆర్ చేస్తు న్నాడని ఆరోపించారు. రెండు పార్టీలు చీకటి ఒప్పందాలు చేసు కొని కాంగ్రెస్ గెలిచే చోట కుట్రలు చేస్తున్నాయన్నారు. బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ అత్మగౌరవాన్ని ఢిల్లీ సుల్తానుల వద్ద తాకట్టు పెడ తారా అని నిలదీశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.40 వేల కోట్లు అప్పు మిగిల్చి పోయిందని, వాటిని చెల్లిం చలేక చస్తున్నానని, సిరిసిల్ల నేత కార్మికులకు కూడా రూ.275 కోట్లు ఉద్దెర పెట్టారని తెలిపారు. నాటి తాగుబోతుల సంసారంలో ఉద్దెర లు, బకాయిలతోనే సరిపోయిందని అన్నారు. నేతన్నలకు రూ 50 కోట్లు చెల్లించామని, ఎన్నికల తరువాత మిగతా బకాయిలు చెల్లిస్తామని చెప్పారు.పెద్దపల్లి నియోజకవర్గా నికి గొప్ప చరిత్ర ఉందని, ఈ నియో జకవర్గం పరిధిలోని మంథనికి ప్రాతి నిధ్యం వహించిన పీవీ నరసింహా రావు దేశానికి ప్రధాని అయ్యారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఇవాళ దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారని, అందుకు పునాదులు వేసింది పీవీనే నని చెప్పారు. ఇదే ప్రాంతానికి చెందిన దివంగత నేత శ్రీపాదరావు స్పీకర్ పదవికే వన్నె తెచ్చారన్నారు. పెద్దపల్లికి ప్రాతినిధ్యం వహించిన కాకా వెంకటస్వామి 1990లో సింగ రేణి దెబ్బతినకుండా ఉండేందుకు కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు తీసుకొచ్చి ఆ సంస్థను కాపాడి అనేక కుటుంబాలకు ఉపాధి కల్పించారని అన్నారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్(Congress) జెండా ఎగు రవేసేందుకు సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు కృషి చేశారని కొనియాడారు. ఏ దిక్కు లేక అక్క మొగుడే దిక్కు అన్నట్లు బీఆ ర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మ పురి ప్రజలు ఓడించిన కొప్పుల ఈశ్వర్‌కే టికెట్ ఇచ్చిందని సీఎం ఎద్దేవా చేశా రు. ఆయన 25 ఏళ్ల నుంచి ఈ ప్రాంతానికి చేసిందేమి లేదని, ప్రధాని మోదీ సింగరేణి గనులను ప్రైవేట్‌పరం చేస్తుంటే మౌనంగా ఉన్నాడని, ఆయనకు, బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ చ చ్చిన పామని, మొన్నటి ఎన్నికల్లో తోక మీద, నడుం మీద కొట్టారని, ఇప్పుడు పడగ మీద కొట్టాలని, శాశ్వతంగా కాల నాగు పీడ విరగడవుతుంది అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
BJP and BRS alliance in telangana elections