Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP: సాయుధ రైతంగ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బిజెపి

BJP: ప్రజా దీవెన, మునుగోడు :తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం లేకపోతే విలీనం గాని , సెప్టెంబర్ 17 కు ప్రత్యేకత గానీ లేవు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం (Banda Srisailam) అన్నారు. మంగళవారం వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మండలంలోని పలివెల గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు మాజీ ఎమ్మెల్యే కొండవీటి గుర్నాథ్ రెడ్డి , జగన్మోహన్ రెడ్డి విగ్రహానికి సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు .

కొండవీటి గుర్నాథ్ రెడ్డి (Kondaveeti Gurnath Reddy)చేసిన పోరాటాన్ని స్పందించుకున్నారు. ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ కేంద్రంలో అధికారం ఉన్న బిజెపి ప్రభుత్వం సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా ఉత్సవాలు జరుగుతాయి . రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తుంటే , ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కాలంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు సాకలి ఐలమ్మ , దొడ్డి కొమురయ్యల పేర్లు విస్తృతంగా వాడుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం, గత సంవత్సరంలో అధికారంలో ఉన్నప్పుడు జాతీయ సమైక్య దినోత్సవం గా నిర్వహించిన టిఆర్ఎస్ , ఎంఐఎంలు ఈ ఏడాది మౌనం దాల్చడం ఏమిటి అని ప్రశ్నించారు.బిజెపి (bjp) కొత్త తరాన్ని తప్పు దారి పట్టించేందుకు జమ్ము కాశ్మీర్ చరిత్రను , తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నాయని అన్నారు . బిజెపి ప్రతి దానికి మతంరంగు పులుముతున్నాయి అని మండిపడ్డారు .

అధికార దాహం , స్వార్థ రాజకీయ ప్రయోజనాలే (Selfish political interests)తప్ప చరిత్రను చరిత్రగా చూసేందుకు బిజెపి (bjp)సిద్ధంగా లేదని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా పలివెల , గుండ్రంపల్లి , గుజ్జ , కోతులారం , ఏపూరు గ్రామాలలో రజాకార్ల ప్రాతినిత్యం ఎక్కువగా ఉండేదని అన్నారు. ఈ ప్రాంతంలో జరిగిన రైతాంగ పోరాటాలు , సాయిధ పోరాటాలలో ఎంతోమంది పోరాట యోధులు అమరులయ్యారని గుర్తు చేశారు . అమరుల ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ సమస్యల పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు .ఈ కార్యక్రమంలో సిపిఎం మండల సహాయ కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు , మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను , సాగర్ల మల్లేష్ ,వేముల లింగస్వామి, గోసుకొండ రాములు , పూల శ్రీను , కల్వకుంట్ల గ్రామ కార్యదర్శి పగిళ్ల మధు , లింగస్వామి ,పి లింగ స్వా మి తదితరులున్నారు.