BJP : ప్రజా దీవెన,నాంపల్లి : ఫిబ్రవరి 9 భారతీయ జనతా పార్టీ ఢిల్లీ రాజధానిలో అఖండ విజయం సాధించడంతో నాంపల్లి మండల ప్రజలు బిజెపి కార్యకర్తలు నాయకులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు .
శనివారం రోజున ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి స్వీట్లు పంచారు ఢిల్లీలో 26 సంవత్సరాలు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మండల బిజెపి నాయకులకు ఆనందం అవధులు లేకుండా పోయింది .
ప్రధాని నరేంద్ర మోడీ చేస్తుంది అభివృద్ధి కార్యక్రమాలను ఢిల్లీ ప్రజలు గుర్తించారని బిజెపి పనులు ఢిల్లీ అభివృద్ధి చెందుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు దాచేపల్లి నరసింహ బీజేవైఎం రాష్ట్ర నాయకులు పానుగంటి మహేష్ గౌడ్ బిజెపి యువజన నాయకుడు నాంపల్లి సతీష్ బిజెపి జిల్లా నాయకులు మండల నాయకులు తిప్పని శ్రీధర్ రెడ్డి మెగావత్ సీతారాం గ్రామాల బిజెపి నాయకులు పాల్గొన్నారు