BJP: ప్రజా దీవెన నాంపల్లి : జనవరి 10 తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా భారతీయ జనతా పార్టీ నాంపల్లి మండల శాఖ అధ్యక్షులుగా దాచేపల్లి నరసింహ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జిల్లా సంస్థాగత ఎన్నికల అధికారి మరియు రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి అయిన కట్ట సుధాకర్ రెడ్డి గురువారం రోజున ప్రకటన విడుదల చేశారు ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు దాచేపల్లి నరసింహ పార్టీకి రెండవసారి అధ్యక్షులుగా నియామకం పట్ల మండల బిజెపి కార్యకర్తలు నాయకులు.
ఆనందం వ్యక్తం చేస్తున్నారు దాచేపల్లి నరసింహ గత శాసనసభ ఎన్నికలలో కార్యకర్తలతో నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉండి పార్టీకి మెజార్టీ తెచ్చారని నాయకులు వాపోయారు అధ్యక్షులుగా ఎన్నికైన దాచేపల్లి నరసింహ ప్రజా దీవెన ప్రతినిధితో మాట్లాడుతూ నాపై ఉంచిన నమ్మకాన్ని కొనసాగిస్తూ రానున్న సంస్థగత ఎన్నికలలో బిజెపి పార్టీని గ్రామస్థాయిలో గెలిపించే విధంగా కృషి చేస్తానని చెప్పారు నా ఎన్నికకు సహకరించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏరెడ్ల శ్రీనివాస్ రెడ్డికి జిల్లా బిజెపి అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు