Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP : ముస్లింలతో బీసీలకు ముడిపెడు తారా

–మీ అయ్య జాగీరా బీసీల్లో ము స్లింలను ఎట్లా చేరుస్తారు

–ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కు వత్తాసు పలుకుతారా

–ఒవైసీ, రేవంత్ గ్యాంగ్ కలిసి బీసీ లను దెబ్బతీసే కుట్రలు

–కాంగ్రెస్ పాలనలో భ్రష్టు పట్టిన వి ద్యా వ్యవస్థ, చాక్ పీసులకు పైసల్లే వ్

–ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చి త్తుగా ఓడించండి

–మీ సంక్షేమం కోసం పనిచేస్తున్న మోదీకి మద్దతివ్వండి

–కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

BJP : ప్రజా దీవెన, నల్లగొండ: బీసీ జాబి తాలో ముస్లింలను ఎట్లా కలుపు తారు మీ జాతి ఏందన్నా, మీ అ య్య జాగీరనుకుంటున్నారా మేం బొట్టు పెట్టుకుంటాం, మాకు జన్మ నక్షత్రం ఉంటుంది, గోత్రనామాలుం టాయి, మొలదారం కట్టుకుంటాం, ఇది మా జాతి, ఒక జాతికి, ఇంకో జాతికి తేడా తెలుసుకోలేని మూర్ఖ త్వపు పార్టీ కాంగ్రెస్, అసలు హిం దువులకు, ముస్లింలకు పోలికేమిటి హిందువులు అడుక్కోవాలా బిచ్చ గాళ్లను చేద్దామనుకుంటున్నారా అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. అసలు బీసీ సంఘా లు ఏం చేస్తున్నాయి ఎవరు అధికా రంలో ఉంటే వాళ్లకు వత్తాసు పలుకుతారా అంటూ మండిప డ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలోని మారుమూల ప్రాంతా ల్లోనూ బీసీ స్థానాల్లో ముస్లింలు పోటీ చేస్తారు వారి ఆధిపత్యమే కొనసాగుతుందన్నారు. జీహెచ్ఎం సీ ఎన్నికల్లో బీసీ స్థానాల్లో ముస్లిం లు పోటీ చేసి హిందువులకు అ న్యాయం చేసినప్పుడు హిందుత్వ వాదులు, బీసీ సంఘాలు స్పందిం చకపోవడంవల్లే ఈరోజు ఒవైసీ, రేవంత్ గ్యాంగ్ కలిసి బీసీలను దెబ్బతీయాలని ముస్లింలను బీసీ జాబితాలో కలిపే కుట్రకు తెరదీ శాయన్నారు. అగ్రకులాల ప్రజలు కూడా బీసీలకు జరిగిన అన్యా యంపై సానుభూతి తెలుపుతుం టే బీసీ సంఘాలు ఎందుకు నోరు మూసుకున్నాయని మండిపడ్డారు. బీసీలతోపాటు హిందువులంతా ఏకమై కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయ కుండా అధికారం చెలాయి స్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఓట్లు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నేతలను హామీలెందుకు అమలు చేయలేదో నిలదీస్తూ గల్లాపట్టి అడగాలని పట్టభద్రులు, టీచర్లకు పిలుపునిచ్చారు.ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో భాగంగా ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాలలో పాల్గొన్నారు.

 

ఎమ్మెల్సీ ఎన్నికల్ల్లో గెలుపుపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీపైన, బీసీ సంఘా ల తీరుపైన నిప్పులు చెరిగారు. ఏమన్నారంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులే కరువయ్యారు. దేశ చరిత్రలో అధికార పార్టీకి మంచి అభ్యర్థులు కరువైపోవడం విచిత్రంగా ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించేం దుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటైనయ్. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరింది. కాళేశ్వరం, డ్రగ్స్, ఫార్ములా ఈ రేస్ సహా పలు అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయిన బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ కాకుండా రక్షించేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని, అందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధిని నిలబెట్టకుండా కాంగ్రెస్ ను గెలిపించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తోంది. రెండు పార్టీలు కలిసి బీజేపీని గెలవనీయకూడదని కుట్ర పన్నాయి. రెండు పార్టీల మధ్య ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిని ఎందుకు నిలబెట్టలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి.

నేనడుగుతున్నా…. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? నిరుద్యోగ భ్రుతి 4 వేల రూపాయలిస్తామన్నారు. 14 నెలలైంది. ఈ లెక్కన ప్రతి నిరుద్యోగికి కాంగ్రెస్ 56 వేల రూపాయలు బాకీ పడింది. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి 14 నెలల బకాయి ఇవ్వాలని నిలదీయండి.
తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కేవలం 25 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చి 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని దుష్ప్రచారం చేసుకున్నారు. మీ వద్దకు వచ్చే కాంగ్రెస్ నేతలను 2 లక్షల ఉద్యోగలేమయ్యాయని నిలదీయండి. 18 ఏళ్లు నిండి చదువుకునే ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామన్నారు. ఒక్కటీ ఇవ్వలేదు. డిగ్రీ ఆపై చదువుకున్న మహిళలంతా మీ వద్దకు ఓట్లు అడగానికి వచ్చే కాంగ్రెస్ నేతలను స్కూటీ ఏమైందని నిలదీయండి.విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నరు. ఓట్ల కోసం వచ్చే సీఎం, మంత్రులను భరోసా కార్డు ఎందుకివ్వలేదో, ఎప్పుడిస్తరో సమాధానం చెప్పాలని నిలదీయండి…
ఫీజు రీయంబర్స్ మెంట్ అందక లక్షలాది మంది విద్యార్థులు అల్లాడుతున్నరు. కాలేజీలు మూతపడుతున్నయ్. పైసలివ్వనిదే సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు లేకుండా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేకపోవడతో విద్యార్థులంతా అల్లాడుతున్నరు. ఓట్ల కోసం మీ వద్దకొచ్చే కాంగ్రెస్ నేతలను మా భవిష్యత్తును దెబ్బతీయడానికి మీరెవ్వరని నిలదీయండి…

ఉద్యోగ, ఉపాధ్యాయులను నిండా ముంచుతున్న ప్రభుత్వం కాంగ్రెస్. రెండో పీఆర్సీ నివేదిక తెప్పించుకోకుండా, అమలు చేయకుండా గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ఉద్యోగులను దారుణంగా మోసం చేసిందని చెప్పాలి. ఉద్యోగులకు 5 డి ఏ లు ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది.

2023 మార్చి నుండి రిటైర్ అయిన ఉపాధ్యాయుల, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు ఇప్పటివరకు ఏ ఒక్కరికి కూడా అందించలేదు. డబ్బులివ్వలేక ఉద్యోగుల రిటైర్డ్ మెంట్ కాలాన్ని 65 ఏళ్ల కాలానికి పెంచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లనే చేసింది. కాంగ్రెస్ అదే బాటలో నడుస్తూ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న యువత భవిష్యత్తును నాశనం చేస్తోంది.

 

ఆఖరుకు ఉపాధ్యాయులు,ఉద్యోగులు జీపీఎఫ్ లో తాము దాచుకున్న సొమ్మును, కూడా ఇవ్వకుండా నెలల తరబడి సతాయిస్తూ వాళ్ల ఉసురు తీస్తోంది. ఉద్యోగులు తమ ఆరోగ్యం దృష్ట్యానో ,కుటుంబ అవసరాల దృష్ట్యానో ,పిల్లల పెళ్లిళ్ల కోసమో జిపిఎఫ్ లో దాచుకున్న వారి డబ్బులను వారే విత్ డ్రా చేసుకుందాం అంటే చెల్లించలేని అసమర్థత స్థితిలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలి?

విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. రెగ్యులర్ ఎంఈఓలు, డిప్యూటీఈవోలు, రెగ్యులర్ డిఇవోలు లేక పర్యవేక్షణ లేక పాఠశాలలు దారుణంగా తయారయ్యాయి. సమీక్షలు లేవు. చదువు లేదు… అజమాయిషీ లేదు.. స్కూళ్లలో చాక్ పీసులకు పైసల్లేవ్… టాయిలెట్లు కడగడానికి స్కావెంజర్లు లేరు… ఆఖరికి విద్యాశాఖకు మంత్రి కూడా లేరు. అట్లాంటి పార్టీకి ఓటెందుకు వేయాలో చెప్పాలని నిలదీయండి…
ఇవన్ని అడుగుతుంటే కుల గణన పేరుతో బీసీ జనాభాను తగ్గించే కుట్రకు తెరదీశారు. కేసీఆర్ సర్కార్ చేసిన ఎస్కేఎస్ సర్వేలో 51 శాతం బీసీల జనాభా ఉంటే…. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుల గణన సర్వేలో 46 శాతానికి ఎట్లా పడిపోయినట్లు? ఎన్నికల సంఘం రాష్ట్రంలో 3.35 కోట్ల మంది ఓటర్లున్నారని చెబుతోంది. రేవంత్ సర్కార్ మాత్రం 3.7 కోట్ల మంది జనాభా మాత్రమే ఉన్నారని చెబుతోంది. మేధావులు, గణాంకాలు మాత్రం రాష్ట్ర జనాభా 4.3 కోట్లుందని అంటున్నారు. ఈ లెక్కన 60 లక్షల మంది ఎటుపోయినట్లు? కాంగ్రెస్ చంపేసిందా?

 

పైగా బీసీ జాబితాలో ముస్లింలను ఎట్లా కలుపుతారు? మీ అయ్య జాగీరనుకుంటున్నారా? మీ జాతి ఏందన్నా…. మీ అయ్య జాగీరనుకుంటున్నారా? మేం బొట్టు పెట్టుకుంటాం. మాకు జన్మ నక్షత్రం ఉంటుంది. గోత్రనామాలుంటాయి. మొలదారం కట్టుకుంటాం. ఇది మా జాతి. ఒక జాతికి, ఇంకో జాతికి తేడా తెలుసుకోలేని మూర్ఖత్వపు పార్టీ కాంగ్రెస్. అసలు హిందువులకు, ముస్లింలకు పోలికేమిటి? హిందువులు అడుక్కోవాలా? బిచ్చగాళ్లను చేద్దామనుకుంటున్నారా అసలు బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు వత్తాసు పలుకుతారా? అంటూ మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ బీసీ స్థానాల్లో ముస్లింలు పోటీ చేస్తారు? వారి ఆధిపత్యమే కొనసాగుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ స్థానాల్లో ముస్లింలు పోటీ చేసి హిందువులకు అన్యాయం చేసినప్పుడు హిందుత్వ వాదులు, బీసీ సంఘాలు స్పందించకపోవడంవల్లే ఈరోజు ఒవైసీ, రేవంత్ గ్యాంగ్ కలిసి బీసీలను దెబ్బతీయాలని ముస్లింలను బీసీ జాబితాలో కలిపే కుట్రకు తెరదీశాయి. అగ్రకులాల ప్రజలు కూడా బీసీలకు జరిగిన అన్యాయంపై సానుభూతి తెలుపుతుంటే… బీసీ సంఘాలు ఎందుకు నోరు మూసుకున్నాయి. బీసీలతోపాటు హిందువులంతా ఏకమై కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి.

అట్లాగే కాంగ్రెస్ వచ్చాక మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తోందని, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తోందని చెప్పాలి. అర్బన్ నక్సల్స్ చేతిలో తెలంగాణ విద్యా వ్యవస్థ బందీ అయ్యిందని మరోసారి గట్టిగా చెప్పాలి. విద్యా కమిషన్ లో నక్సల్స్ భావజాలమున్న వాళ్లకు చోటు కల్పించారని చెప్పారు. చివరగా ‘‘గన్నుల పాలన కావాలా?…. పెన్నుల పాలన కావాలా?’’ ఆలోచించాలని కోరాలి.

తెలంగాణకే కేంద్ర బడ్జెట్ లో అన్యాయం చేసిందని, నిధులు కేటాయించాలనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. గత 11 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు కేటాయించిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధం. అట్లాగే తెలంగాణలోని గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులపై చర్చకు సిద్ధమా? శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా చెప్పాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, మనోహ ర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, నాగం వర్షిత్ రెడ్డి, కంకణాల నివేదిత రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.