Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Muslim development: ముస్లిం అభ్యున్నతికి బీజేపీ కృషి

దేశంలో ఓటు బ్యాంకుతో సంబంధం లేకుం డా ముస్లింల అభ్యున్నతికి పాటు పడే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు మైనారి టీలు ఓటు బ్యాంకు మాత్రమే
బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా వెల్లడి
ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో ఓటు బ్యాంకుతో సంబంధం లేకుం డా ముస్లింల అభ్యున్నతికి పాటు పడే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా అన్నారు. గురువారం కరీంనగర్ ఎంపీ కార్యా లయంలో జరిగిన మీడియా సమా వేశంలో మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్, రాష్ట్ర, జిల్లా మైనార్టీ మోర్చా నాయకులతో కలిసి అఫ్సర్ పాషా మాట్లాడుతూ ఎలక్షన్ వచ్చినప్పుడే కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలకు మైనార్టీలు గుర్తొస్తారు. కొందరు మైనారిటీ నాయకులు, అమ్ముడు పోయే సంఘాల నేతలు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ఓటేయాలని చెబుతున్నారని దుయ్యబట్టారు.

ప్రజాస్వామ్యం హరించే హక్కు ఎవరికీ లేదని, ఎస్సీ ల కంటే మైనా ర్టీలు చాలా వెనకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నయీ రోషిణి, నయి మంజీల్ , ఉస్తాద్, హున్నార్ హాట్ కి చెందిన చేతివృ త్తుల కోసం ఎగ్జిబిషన్ స్టాల్స్ కేంద్రం అనేక చోట్ల ఏర్పాటు చేస్తోందని, ఓటు బ్యాంకుతో సంబంధం లేకుం డా బీజేపీ మాత్రమే ముస్లింల అభ్యున్నతి కోసం కృషి చేసే పార్టీ అని పేర్కొన్నారు. ముస్లింల నైపు ణ్యం కోసం స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ తో ఉపాధి కల్పించే విధంగా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంద న్నారు. కేంద్రం నుంచి వచ్చే 82 స్కీమ్ లను ముస్లింలకు అందకుం డా ఇక్కడి కొన్ని ముస్లిం సంఘాల నేతలు అడ్డుపడుతున్నారన్నారు.

యూపీ లో గుండా రాజ్యం పోయి యోగి రాజ్యం వచ్చిందన్నారు.. యూనిఫాం సివిల్ కోడ్ ను రాజకీ య స్వార్థం కోసం ఇతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. ముస్లిం మహిళల శ్రేయస్సు కోసం త్రిపుల్ తలాఖ్ తీసుకొచ్చిన మహనీ యుడు ప్రధాని మోదీ అని, ప్రపంచ వ్యాప్తంగా భారత్ లో మాత్రమే త్రిపుల్ తలాఖ్ చట్టం ఉందని అన్నారు. కాశ్మీర్ ఈరోజు ప్రశాంతం గా ఉండటానికి కారణం మోదీ యేనన్నారు. కాశ్మీర్ స్వయం సమృద్ధిగా ఉండటానికి ఆర్టికల్ 370 ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.

కేంద్రం నిధులతోనే కరీంనగర్ పట్టణంలోని ముస్లిం బస్తీలు అభివృద్ధి చెందాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముస్లిం భూమిని కబ్జా చేయడంతోపాటు రేకుర్తి లో ఇళ్లను పడగొట్టిన విషయాన్ని గుర్తుంచుకోవా లన్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కమ్యూనల్. సామాజికంగా వెనుకబడిన ముస్లిం ల కోసం పస్మంద స్కీమ్ ను మోదీ తీసుకొచ్చారని, యూపీలో అత్యధికాం మైనారిటీలున్న రాంపూర్ లో బీజేపీ గెలవడానికి కారణం ఈ స్కీమ్ మాత్రమే నన్నారు. మత చాందస వాదుల ట్రాప్ లో పడి ముస్లింలు మోసపోవద్దని కోరారు.

BJP efforts on Muslim development