Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP Ramachandra Rao : బిజెపిది పోరు బాట తెలంగాణ ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారు

ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా పని చేస్తాము

తెలంగాణ రాష్ట్ర బిజెపి నూతన అద్యక్షులు రామచంద్ర రావు

BJP Ramachandra Rao : ప్రజాదీవెన, సూర్యాపేట : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి మెజారిటి స్ధానాలు గెలుచుకుంటుందని బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షులు రామచంద్ర రావు అన్నారు. సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాలాజీ గార్డెన్స్ లో రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర రావు అద్యక్షతన జరిగిన సూర్యాపేట జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిజెపి చూస్తున్నారని, ప్రజలు బిజెపి బిజెపి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బిజెపికి నాయకులు కార్యకర్తలు పని చేయాలని, ఇకపై బిజెపిది పోరుబాటని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, హామీలు అమలు చేసే విధంగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిదులు ఇస్తుందని, అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారానే అమలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. రేషన్ బియ్యం లో కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని సన్నబియ్యం ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీదని, ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి రేషన్ దుకాణాల వద్ద నరేంద్ర మోడీ ఫోటో ఖచ్చితంగా పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాలలో రోడ్లు, మున్సిపాలిటీలో అమృత పథకం ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో నిధులు, రైల్వే లైన్లు జాతీయ రహదారులు,నూతన రైల్వే స్టేషన్లు, వందే బారత్ రైళ్లు ఇలా అనేక అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ములుగులో గిరిజన యూనివర్సిటీకి, వరంగల్ లో విమానాశ్రయం కేంద్రం ఏర్పాటు చేస్తుందని రామగుండం ఎరువుల ప్యాక్టరి , బీబీనగర్ లో ఏయిమ్స్ కేంద్రం ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు .

 

ప్రతి ఒక్క కార్యకర్త కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలతో విసిగిపోయారని బిజెపి ప్రభుత్వం వైపు చూస్తున్నారని, రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుందని కేంద్రం నుంచి నిధులు పెద్ద ఎత్తున వస్తాయని ఈ సందర్భంగా అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పోరాటాల జిల్లా చైతన్యవంతమైన జిల్లా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని అన్నారు. తెలంగాణలో బిజెపి 40 లక్షల సభ్యత్వాన్ని కలిగి ఉన్న రాజకీయ పార్టీ అని ఉమ్మడి నల్గొండ జిల్లా 2 లక్షల సభ్యత్వం కలిగి ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఆ రిజర్వేషన్లకు కేవలం బీసీలకు ఇవ్వాలని అంతేగాని అందులో 10% ముస్లింలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అటువంటి ప్రయత్నాలను బిజెపి అంగీకరించబోదని ఆయన అన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బిజెపి ఎల్లప్పుడు వ్యతిరేకంగా వుంటుందని ఆయన తెలియజేశారు. కాబట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలో బిజెపి నాయకులు భారీ ర్యాలి నిర్వహించారు. రామచంద్ర రావు ను గజమాలతో సన్మానించారు.
ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీ లత రెడ్డి, రెడ్డి, మాజి ఎంపి బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ప్రభారి రాజమౌళి, పోరెడ్డి కిషోర్ రెడ్డి, కడియం రామచంద్రయ్య, సలిగంటి వీరేంద్ర, చలమల్ల నర్సింహ, మరియు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు