BJP : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలోని బీజేపీ నాయకులకు ఆ పార్టీ అధిష్టానం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని 27 జిల్లాల బీజేపీ అధ్యక్షుల ఎన్నికకు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై సునీల్ బన్సల్, అరవింద్ మీనన్, కిషన్‌రెడ్డి, రిటర్నింగ్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. శనివారం నామినేషన్ల స్వీకరణ, ఆదివారం జిల్లా అధ్యక్షుల ప్రకటన చేయనున్నట్లు ప్రకటించింది._*