Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP Kisan Morch: బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా

BJP Kisan Morch: ప్రజా దీవెన, కోదాడ: రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా నేడు ఆర్డీవో కార్యాలయం వద్ద బిజెపి కిసాన్ మోర్చా (BJP Kisan Morch) ఆధ్వర్యంలో రైతులు ధర్నాను నిర్వహించి ఆర్డీవోకు సూర్యనారాయణకు మెమోరాండంను అందించారు . ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి బిజెపి కోదాడ అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ (Kanagala Narayana) మాట్లాడుతూ ఆగస్టు 31 వ తారీఖున కురిసిన వర్షాల వలన వరదలు వచ్చి పంట కాలువలకు చెరువులకు రహదారులకు పడిన గనులను 18 రోజులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం.

.సాగర్ కాల్వకు పడిన గండ్లను వెంటనే పూడ్చివేసి రైతులకు సాగునీరును అందించాలని రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం అంచనాలను సమగ్రంగా సర్వే (survey) చేయడం లేదు. .వరదల వలన బూడిన బావులు,బోర్లు కొట్టుకుపోయిన మోటార్లను కూడా నష్టంకిందపరిగనించాలి తెలిపారు. రైతు భరోసాను వెంటనే రైతులకు అందించాలి. రైతు రుణమాఫీ నిబంధనలుసడలించి అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అమలు చేయాలి. ఇసుక మేట వేసిన ప్రతి ఒక్క ఎకరాకు రూ.50,000, పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు 25000, వ్యవసాయ బావి పూడికకు 50 వేలు, బోరుకు పాతికవేలు, మోటారుకు 50 వేలు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ (bjp)డిమాంఢ్ చేస్తున్నది అని అన్న్నారు.

కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (Kisan Morcha State Executive Committee Members)వెలువలు చిట్టయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్, కో కన్వీనర్ బొలిశెట్టి కృష్ణయ్య సంక్షేమ పథకాల నల్లగొండ కన్వీనర్వంగవీటిశ్రీనివాసరావు, అనంతగిరి మండల అధ్యక్షుడు వై రామారావు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు మండల అధ్యక్షులు కృష్ణప్రసాద్,వేంకటేశ్వర రెడ్డి లు ,జిల్లా జనార్ధన్, జెల్ల నరసింహారావు, సైదులు, సాయి కృష్ణ ,పండుసాహెబ్,దాసు ,శేట్టికిరణ్కుమార్,భూమాశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.