–బిజెపి ఎమ్మెల్సీ అంజి రెడ్డి
BJP MLC Anji Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: బీజేపీ సీనియర్ నాయకుడు, స్వర్గీయ గుండగోని మైసయ్య గౌడ్ 27వ వ ర్ధంతి సందర్బంగా నల్గొండ పట్ట ణంలోని ఆయన విగ్రహానికి మైస య్య గౌడ్ గారి కుటుంబ సభ్యుల తో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమెయిల్ అంజి రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెం కటేశ్వర్లు, పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు.
ఈ సంద ర్బంగా బిజెపి నల్గొండ జిల్లా అధ్య క్షులు నాగం వర్షిత్ రెడ్డి ఏర్పాటు సంస్మరణ సభలో ఎమ్మెల్సీ అంజి రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా ఒక గొప్ప జాతీయ నాయకుడిని కోల్పోయిందని, నమ్ముకున్న సిద్ధాం తం కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజాసేవలో అహర్ని శలు శ్రమించిన మహానేత గుండ గోని మైసయ్య గౌడ్ అని పేర్కొన్నా రు.
బడుగు, బలహీన వర్గాల హ క్కుల కోసం పోరాడిన ఆయన, పే ద ప్రజలకు పెన్నిధిగా నిలిచారని, మైసయ్య గౌడ్ ఆశయం కోసం ప్రతి కార్యకర్త నల్గొండ జిల్లాలో కాషాయ జెండా గెలిపించడం కోసం పని చే యాలనీ కోరారు. కాసం వెంకటేశ్వ ర్లు మాట్లాడుతూ మైసయ్య గౌడ్ తన రాజకీయ జీవితంలో అనేక అడ్డంకులను అధిగమించి, నిస్వార్థ సేవను తన లక్ష్యంగా చేసుకున్నా రన్నారు. దేశద్రోహుల కుట్రలకు ఎ దురొడ్డి,ఎన్నో దాడులను తట్టుకు ని,చివరకు నక్సలైట్ల దుర్మార్గపు చేతుల్లో చండూర్ మండలం తెరట్ పల్లి గ్రామంలో ప్రాణాలు కోల్పో యారని, కానీ ఆయన చూపిన మార్గం, ఆయన కలలు మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ మ హంకాళి జిల్లా అధ్యక్షులు గుండ గోని భరత్ గౌడ్,బిజెపి రాష్ట్ర కార్య దర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, సూ ర్యాపేట జిల్లా అధ్యక్షులు చల్ల శ్రీల త రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర నాయకులు వీ రెళ్లి చంద్రశేఖర్, గుండగోని గిరి బాబు ,శ్రీ దోనూరు వీరారెడ్డి , సాధినేని శ్రీనివాస్, బిజెపి మున్సి పల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ , పట్టణ కౌన్సిలర్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.