BJP OBC:ప్రజా దీవెన, చండూర్ : బిజెపి ఓబీసీ (BJP OBC) మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఎలక్షన్ కు ముందు బీసీ డిక్లరేషన్ ను (Declaration of BC) వంద రోజులలో పూర్తి చేస్తానని అధికా రంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తుం ది కానీ బిసి కులాలకు ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి నెరవేర్చలేదు అని చండూరు బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మున్సిపల్ కేంద్రంలో సోమవారం రెవెన్యూ కార్యాలయంలో (Revenue Office)తాసిల్దార్ కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్ర మంలో పట్టణ అధ్యక్షుడు పందుల సత్య గౌడ్ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం నరేందర్ శ్రీహరి సముద్రాల వెంకన్న తదిత రులు పాల్గొన్నారు.
మర్రిగూడ తహసీల్దార్ కు వినతి పత్రం… ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఎలక్షన్ కు ముందు బీసీ డిక్లరేషన్ (Declaration of BC) ను వంద రోజులలో పూర్తి చేస్తానని అధికా రంలోకి వచ్చి నేటికీ ఏడు నెలలు కావస్తుంది కానీ బిసి కులాలకు ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి నెరవేర్చ నందుకు రెవెన్యూ కార్యాలయం లో డిప్యుటీ తాహసిల్దార్ కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ (bjp obc) మండల అధ్యక్షులు పగిళ్ల లింగస్వామి, బీజేపీ మండల అధ్యక్షులు పి రాజేందర్ నాయక్ గ్యార గోపాల్. పందుల రాములు గౌడ్ గ్యార గిరి. లింగం, శేఖర్, సలార్జాన్. చాపల వెంకటేష్. నవీన్. సైదులు, రమేష్, గణేష్, నాగరాజు. పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల ఓబీసీ (obc)మోర్చా ఆద్వ ర్యంలో… ఓబిసి మోర్చా చిట్యాల మండల అధ్యక్షులు గుంటోజు నాగాచారి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దగోని అంజన్ కుమార్ ల ఆధ్వర్యంలో చిట్యాల మండల తహసిల్దార్ కార్యాలయం (Office of Tehsildar)ముందు సోమవారం ధర్నా కార్యక్రమానికి బిజెపి జిల్లా సీనియర్ నాయకులు చికిలం మెట్ల అశోక్, బిజెపి మండ ల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్ గార్లు హాజరై మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ 23 శాతం నుండి 42 శాతం పెంచాలని, అర్హత కలిగిన ప్రతి బీసీ కులస్తులకు 42 శాతం ప్రభుత్వ నిర్మాణ పనులలో అవకాశాలు కల్పించాలని, వెనుకబడిన తరగతులలో రిజర్వేషన్లు కలిగిన కులాలకు తగినంత బడ్జెట్ కేటాయించాలని, బీసీలకు ప్రకటించిన 50 సంవత్సరాలు పూర్తయిన ప్రతి కుల వృత్తి దారులకు పెన్షన్ ప్రకటించాలని, బీసీ కులస్తులు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను వీలైనంత త్వరగా అందించాలని, ఓబీసీలకు బీసీ గురుకులాలను వీలైనంత త్వరగా ఆధునికరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బోడిగి లక్ష్మయ్య , పాపనివాసుదేవ్, గంజి గోవర్ధన్ , అంశాల అనిల్ కుమార్, వెంకటేశం, తొలి సూ రి నరసింహ, తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు.