–పట్టించుకోని అధికారులు
–నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి
BJP President Dr. Nagam Varshit Reddy : ప్రజా దీవెన , నల్గొండ : యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. తేమ, తాలు పేరుతో బస్తాకు రెండు కిలోలు కోత విధిస్తున్న పట్టించుకోవడంలేదని బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆరోపించారు. రైతులను ఆదుకోవాలని బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని అర్జాలబావి, తిప్పర్తి, మాడ్గులపల్లి, వేములపల్లిలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి లు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన చెందారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో జిల్లా మంత్రులు, సివిల్‌సప్లయ్ అధికారుల తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం ఈ సీజన్‌లో 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఇందుకోసం రూ.16 వేల కోట్లకుపైగా నిధులు అవసరం. దీంతోపాటు కనీసంగా 25 లక్షల టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేస్తే బోనస్ రూపంలో మరో రూ.1,200 కోట్లకు పైగా అవసరమని, నిదులు వెచ్చించడం ఇష్టంలేకనే ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు, నాలుగు రోజులపాటు వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.దీంతో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట ఎక్కడ వానపాలై పోతుందోనని రైతులు ఆందోళన చెందుతుదన్నారని పేర్కొన్నారు.
వర్షాలు పడితే ధాన్యం తడవకుండా కావలసిన సౌకర్యాలను కూడా కల్పించలేదని అన్నారు. సర్కారు నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు, మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేసి మంత్రులకు కమిషన్లు చెల్లిస్తున్నారని ఆరోపించారు.
కమీషన్లకు కకృతి పడి మిల్లర్లతో చీకటి ఒప్పదం చేసుకోని కొనుగోళ్లలో ఉదేశ్శపూర్వక జాప్యం చేస్తున్నారన్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, పాపయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరా చారి, పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకన్న, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి, అశోక్ రెడ్డి, బిజెపి నాయకులు పక్కీరు మోహన్ రెడ్డి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, నవీన్ రెడ్డి, పిన్నింటి నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.