BJP : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ లో సంస్థాగత ఎన్నికల సందడి ప్రారంభమైంది. పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్ర బీజేపీ నాయక త్వం జిల్లా కమిటీల అధ్యక్షుల ఎంపికపై దృష్టి సారించింది. ఈ మేరకు సోమవారం మొత్తం 27 జిల్లాలకు గాను ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానం జిల్లా అధ్యక్షులను అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డి, అదేవిధంగా జయ శంకర్ భూపాల్‌పల్లి అధ్యక్షుడిగా నిశిధర్ రెడ్డి, కామారెడ్డి అధ్యక్షు డిగా నీలం చిన్న రాజులు, హనుమ కొండ అధ్యక్షుడిగా కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ అధ్యక్షుడిగా గంట రవి కుమార్, నల్లగొండ అధ్యక్షుడి గా నాగం వర్షిత్ రెడ్డి, జగిత్యాల అధ్యక్షుడిగా రాచకొండ యాదగిరి బాబు, జనగామ- సౌడ రమేశ్, నిజామాబాద్ – దినేష్ కులాచారి, వనపర్తి- నారాయణ, మేడ్చల్ రూరల్ – శ్రీనివాస్, ఆసిఫాబాద్- శ్రీశైలం ముదిరాజ్, ములుగు – బలరాం, మహబూబ్‌నగర్ – శ్రీనివాస్ రెడ్డి, మంచిర్యాల – వెంకటేశ్వర్లు గౌడ్, పెద్దపల్లి – సంజీవ రెడ్డి, ఆదిలాబాద్ – బ్రహ్మానంద రెడ్డి, సికింద్రాబాద్ – భరత్ గౌడ్ అధ్యక్షులుగా నియ మితులయ్యారు.
కాగా మరికొన్ని జిల్లాలకు గాను అధ్యక్షుల నియా మకంపై రాష్ట్ర పార్టీ ఇంచార్జీ సునీ ల్ బన్సల్ ఎన్నికల పరిశీలకులు అరవింద మీనన్ రాష్ట్ర అధ్యక్షు డు జి.కిషన్ రెడ్డి లు కేంద్ర నాయక త్వంతో చర్చిస్తున్నారు. ఇక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో కొత్తగా బీసీ వర్గాలకు ఈ పదవి ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. చాలా చర్చల తరువా త పార్టీ నాయకత్వం ఈటల రాజేం దర్ పేరు ఖరారు చేసినట్లు విశ్వస నీయంగా తెలుస్తోంది. ఇదే సమ యంలో మరో ఇద్దరు నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టా నం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే ఈటల రాజేందర్ తెలం గాణ బీజేపీ కొత్త సారథి నియామ క ప్రక్రియ కూడా చక చకా పూర్తి చేసేందుకు బిజెపి అధిష్టానం కస రత్తు ప్రారంభించింది.