Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PM Modi: సబ్బండ వర్గాలకు సమన్యాయం

దేశంలో సబండవర్గాలకు సమన్యాయం అందించడమే భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యమని ఆ మేరకే మా ప్రభుత్వ విధానాలు ఉంటా యని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు.

ఇదే మా ఐడియా ఆఫ్‌ ఇండియా
తెలంగాణలో రెండు కాదు, మూడు ‘ఆర్‌ ‘లు
ఒకటి ఢిల్లీ ఆర్‌, రెండు తెలంగాణ ఆర్‌, మూడోది రజాకార్‌ ఆర్ లు
జూన్ 4న దేశం గెలవబోతోంది, వ్యతిరేకులు ఓడిపోతున్నారు
దోపిడీ, వారసత్వ రాజకీయాలే కాంగ్రెస్‌ జీవిత కాల విధానం
బిఆర్‌ఎస్‌ కారుకు ఓటేస్తే కాంగ్రెస్‌ కు వేసినట్టే
బిఆర్‌ఎస్‌ అవినీతిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలేవి, అదే నిదర్శనం
కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అందుకే ముస్లిం రిజర్వేషన్లకు ఆ పార్టీ మద్ద తు
ఎల్బీస్టేడియం బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రజా దీవెన, హైదరాబాద్‌: దేశంలో సబండవర్గాలకు సమన్యాయం అందించడమే భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యమని ఆ మేరకే మా ప్రభుత్వ విధానాలు ఉంటా యని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra modi) పునరుద్ఘాటించారు. తెలంగాణలో ఒకవైపు ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట వ సూళ్లు జరుగు తుండగా హైదరాబా ద్‌లో రజాకార్‌ పేరిట మరో ఆర్‌ ట్యాక్స్‌ కూడా వసూలవుతోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు.లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన నారాయణ పేట(Narayana pet) జిల్లా కేం ద్రంలో, సాయంత్రం హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో నిర్వహించిన జన సభల్లో పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం ఏర్పడి నప్పటి నుంచి ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌పై(RR Tax) చర్చ బాగా జరుగుతోం దని, ఒక ఆర్‌ తెలంగాణాకు సంబం ధించినది కాగా, మరో ఆర్‌ ఢిల్లీదని, ఈ రెండు ‘ఆర్‌’లూ హైదరాబాద్‌ను, తెలంగాణను ఏటీఏంగా మార్చు కున్నాయని, నేను ఎవరి పేరూ ఎత్తలేదుగానీ డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌పై ఇక్కడి సీఎం స్వయంగా వివరణ ఇచ్చుకున్నారని, హైదరాబాద్‌లో మరో ఆర్‌ ట్యాక్స్‌(R Tax) ఉందని, మరో ఆర్‌ అంటే రజాకార్‌ ట్యాక్స్‌ ఇది హైదరాబాద్‌ పాత నగరంలో కని పిస్తుందని, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మద్దతుతో మజ్లిస్‌ ఈ పన్ను వసూ లు చేస్తోందని ఆయన ధ్వజ మెత్తా రు. పదేళ్ల కిందట ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన తమ పార్టీ బహిరంగసభను దేశ రాజకీయాల్లో ఓ మేలిమలుపుగా ఆయన అభివర్ణించారు. ఆ సభకు తాము టికెట్‌ పెడితే, జనం టికెట్‌ కొను క్కొని మరీ వచ్చారని మోదీ గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ వద్దు, బీఆర్‌ఎస్‌ వద్దు,ఎంఐఎం వద్దు బీజేపీకే(BJP)ఓటేద్దామని గెలిపిద్దామని తెలం గాణ సమాజం గొంతెత్తి చాటు తోందని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా అద్భుత స్పందన కనిపించిందని వివరించారు. జూన్‌4న దేశం గెలువబోతోందని, 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం గెలువబో తోంది. భారత్‌ వ్యతిరేకులు ఓడిపో బోతున్నారని వ్యాఖ్యానించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌, సీఏఏ, యూని ఫాం సివిల్‌ కోడ్‌, ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దును వ్యతిరేకి స్తున్నవాళ్లు ఓడిపోబోతున్నారు అని మోదీ జోస్యం చెప్పారు. కాంగ్రె స్‌(Congress) పార్టీ మొదటి నుంచీ మధ్య తరగతి ప్రజలకు వ్యతిరేకం అని ఆయన ఆరోపించారు. మధ్య తరగ తి వారు ఐస్‌క్రీంలపై ఖర్చుచేస్తూ ధరల పెరుగుదలను విమర్శిస్తా రంటూ ఒక కాంగ్రెస్‌ నేత గతంలో వ్యాఖ్యానించారని గుర్తుచేశారు.

కాంగ్రెస్‌ పార్టీ మధ్యతరగతివారికి సంబంధించి కనీస ప్రస్తావన కూడా తన మేనిఫెస్టోలో చేయలేదని , కానీ, మధ్య తరగతి వారి ఆస్తుల ను ఎక్స్‌రే తీస్తుందట, దానిని తమ ఓటుబ్యాంకు కోసం వినియోగిం చాలని యోచిస్తోందని మోదీ ఆరో పించారు. మీ సంపదపై మీ వారసు లకు అధికారం ఉంటుందా ఉండదా మీ సంపదకు కోతపెట్టే ప్రభుత్వం మీకు అంగీకారమా అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. దేశం ఇప్పు డు డిజిటల్‌ పవర్‌, స్టార్టప్‌ పవర్‌, ఆర్థిక శక్తి, అంతరిక్ష శక్తిగా అవతరించిందని ఇదీ తన ట్రాక్‌ రికార్డ్‌ అని మోదీ(Modi) వివరించారు. లూటీ, లూటీ, సంతుష్టీకరణ వార సత్వం, ఉగ్రవాదాన్ని పెంచిపోషిం చడం కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డని దుయ్య బట్టారు.

కాంగ్రెస్‌ హయాంలో దిల్‌ సుఖ్‌నగర్‌లో సీరియల్‌ బాంబు పేలుళ్లు(Serial bomb) జరిగాయని, హోటళ్లకు, సినిమాలకు వెళ్లినవారు బాంబు పేలుళ్లకు బలయ్యేవారని ఆవేదన వెలిబుచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం లో ఇలాంటివి చాలా జరిగాయి కానీ, ఇప్పుడు ఇలాంటివి జరుగు తున్నాయా అని ప్రశ్నించారు. కేం ద్రంలో బలమైన ఎన్డీయే ప్రభుత్వం ఉండడం వల్లే, దేశవ్యాప్తంగా పేలు ళ్లు ఆగాయని స్పష్టం చేశారు. ఇది ఇండియా కూటమికి నచ్చట్లేదని అందేకే మోదీని(Modi) తొలగించేందుకు ఒక్కటై మళ్లీ పాత రోజులు తెచ్చేం దుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్య బట్టారు. దేశం ఉగ్రవాదుల కబంధ హస్తాల్లోకి వెళ్లకూడదని పిలుపు నిచ్చారు.

BJP support to all people