BJP : ప్రజా దీవెన,నల్గొండ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా నల్గొండ బిజెపి జిల్లా కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించుకున్న బిజెపి నాయకులు కార్యకర్తలు
డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 27 సంవత్సరాల తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకోవడం పట్ల నల్గొండ జిల్లా బీజేపి కార్యాలయంలో బీజేపి శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు ..
ఈ సందర్భంగా ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకున్నారు,
నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలందరూ ఆకర్షితులై డిల్లీలో బిజెపి పార్టీకి పట్టం కట్టారని బిజెపి నాయకులు తెలిపారు
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, నూకల వెంకటనారాయణ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్, బిజెపి జిల్లా నాయకులు కంచర్ల విద్యాసాగర్ రెడ్డి , బిపంగి జగ్జీవన్ రామ్, దాసోజు యాదగిరి ఆచారి, లోకనబోయిన రమణ ముదిరాజ్, బాకీ నరసింహ, బోగారి అనిల్ కుమార్, టంగుటూరి శ్యామ్, గుగులోతు తార, దేవి, తిప్పార్తి మండల అధ్యక్షులు వంగూరి రవి, కణగల్ మండల అధ్యక్షులు పరసనబోయిన ఈశ్వర్ బిక్షం, తదితరులు పాల్గొన్నారు..