BJYM : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : హెచ్ సి యూ విద్యార్థుల పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేయడాన్ని, చలో హెచ్ సి యు కార్యక్రమంలో బీజేవైఎం నాయకుల పట్ల పోలీస్ లు ప్రవర్తన విధానాని వ్యతిరేకిస్తూ గురువారం బీజేవైఎం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని దగ్ధం చేసారు.
ఈ సందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ
విశ్వవిద్యాలయం భూములను కాపాడుకోవాలి. అదేవిధంగా పర్యావరణాన్ని మూగజీవాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న అమాయక విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం పట్ల బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి తక్షణమే బహిర్గత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పర్యావరణానికి హాని కలిగిస్తూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేసే ప్రక్రియను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులను పోలీసులు అక్రమ అరెస్ట్ లు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు.విద్యార్థుల పక్షాన నిలిచి పోరాడతామని పేర్కొన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల్లో చెట్లను నరికి వేసి మూగజీవాలకు ఆవాసాలు లేకుండా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుష్ట వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, దిండు భాస్కర్ గౌడ్, ,బీజేవైఎం పట్టణ అధ్యక్షులు దుబ్బాక సాయి కిరణ్, జిల్లా కార్యదర్శి గుండెబోయిన శాంతి స్వరూప్, బిజెపి 2 టౌన్ అధ్యక్షులు మిర్యాల వెంకన్న, నాయకులు కొత్త లింగస్వామి, భరత్, సాయి కుమార్, వట్టికోటి దుర్గా, కర్నాటి శివ, బిజెపి నాయకులు పాశం శ్రీనివాస్ రెడ్డి, పక్కీరు మోహన్ రెడ్డి, కాశమ్మ, నవీన్ రెడ్డి, బైరు సత్తయ్య, గోపి, జగ్జీవన్, వేమి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కటకం శ్రీధర్, గోగులోతు తార బీజేవైఎం,బిజెపి నాయకులు పాల్గొన్నారు.