Blood Donation: ప్రజా దీవెన,కోదాడ:అన్ని దానాల కంటే రక్తదానం (Blood Donation) గొప్పదని మాతంగి భాయమ్మ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు అన్నారు . గురువారం పట్టణంలోని స్థానిక ఉషా నర్సింగ్ హోమ్ లో సూర్యాపేటకు చెందిన కోడి అనుష (Anusha)కు ఆపరేషన్ నిమిత్తం బి పాజిటివ్ బ్లడ్ అవసరం అని డాక్టర్ చెప్పడంతో విషయము తెలుసుకున్న ఎంబిఎం గ్రూప్ సభ్యులైన కోదాడ కు చెందిన హర్ష స్టూడియో బాలు వారికి రక్తదానం (Blood Donation) చేసి ప్రాణదాతగా నిలిచారు.ఈ సందర్భంగా గ్రూపు సభ్యులు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు ఎంతోమందికి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలుస్తున్నా మని తెలిపారు.రాబోయే రోజులలో ఈ ట్రస్టు ద్వారా ఎంతోమందికి రక్తం అందించడానికి సహకరిస్తున్న గ్రూపు సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. బాలు ఇప్పటివరకు ఎంబీఏం ట్రస్టు ద్వారా 06 సార్లు రక్తదానం చేసి రోగుల ప్రాణాలు (Patient survival) కాపాడాడని వారికి ఎంబిఎం ట్రస్టు (MBM Trust ) సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇప్పటివరకు ఈ ట్రస్ట్ కు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ట్రస్టు తరఫున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంబిఎం ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.