ప్రజా దీవెన, కోదాడ: రక్తదానం మరియొకరి ప్రాణాలను కాపాడుతుందని అందుకే అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని యం యస్ విద్యా సంస్థల సీ ఈ వో యస్ యస్ రావు రక్తదాతలకు పిలుపునిచ్చారు స్థానిక ఖమ్మం ఎక్స్ రోడ్ నందు గల. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న మాట్లాడుతూ రక్త దానం అన్ని దానాలలో గొప్పది అని,గత 15 సంవత్సరాలు గా హెచ్ డి ఎఫ్ సీ బ్యాంక్ వారి సామాజిక బాధ్యతగా ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నందుకు ఈ సందర్భంగా బ్యాంక్ వారిని అభినందించారు.
తేజ ఫార్మసీ కళాశాల విద్యార్థులు,బ్యాంక్ సిబ్బంది నుండి 40 యూనిట్లు రక్తం సేకరించి తిరుమల బ్లడ్ బ్యాంక్ వారికి అందించారు. ముఖ్యంగా ముఖ్యంగా కోదాడ పట్టణం జాతీయ రహదారి పై ఉన్నందున తరచుగా రోడ్ ప్రమాదాలు జరిగినప్పుడు ఈ రక్తాన్ని బాధితులకు ఉచితంగా అందజేయాలని తెలిపారు.తేజ ఫార్మసీ కళాశాల విద్యార్థులు రక్త దానం శిబిరంలో పాల్గొని రక్తదానం చేసినందుకు వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్.శంకరయ్య ఆపరేషన్ మేనేజర్ పి.జాకీర్ హుస్సేన్,బ్రాంచ్2 మేనేజర్ జె.నరేష్,తేజ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి రెడ్డి,తిరుమల బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మధు,కొండలు పలువురు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.