Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Boda Sunil Madiga: బోడ సునీల్ కు వల్లభాయ్ పటేల్ జాతీయ స్థాయి స్ఫూర్తి అవార్డు

Boda Sunil Madiga: ప్రజా దీవెన, శాలిగౌరారం: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూర్ గ్రామానికి చెందిన రాష్ట్ర ఎంఆర్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్ మాదిగ (Boda Sunil Madiga) కు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్థాయి స్ఫూర్తి అవార్డు అందుకున్నారు.హైదారాబాద్ చిక్కడపల్లి కళా నాట్య వేదిక తాగరాయగానసభ ఆడిటోరియంలో హోప్ స్వచ్ఛంద సేవాసమితి,సింధు ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భారతదేశ స్వాతంత్ర్య (Independence of India) ఉద్యమ నాయకుడు భారత ప్రథమ హోంమంత్రి మరియు ఉప ప్రధాని, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 149వ జయంతి సందర్భంగా బోడ సునీల్ మాదిగకు అందజేశారు.

సామాజిక ఉద్యమాలు,సమాజ సేవ,దళిత బహుజన వర్గాల (Social movements, community service, Dalit masses) అభివృద్ధి కై మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పని చేస్తున్నందుకు ఈ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమం లో కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు, తెలంగాణ రాష్ట్ర రచయితల (Authors of Telangana State) సంఘం అధ్యక్షులు డా. నాగేశ్వరం, వీరనారి ఘాన్సీ లక్ష్మీభాయ్ వారసురాలు శాంతభాయ్,గుర్రం జాషువా వారసురాలు అమృతపూడి రేవతి ఇతర పెద్దలు పాల్గొని అవార్డు అందజేసి సన్మానించారు. ఈ సందర్బంగా అవార్డు అందుకున్న బోడ సునీల్ మాదిగ ను పలువురు అభినందించారు.దైద వెంకన్న అనిత లకు బోడ సునీల్ మాదిగ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.