*పరిశీలనలతోనే సరిపుచ్చుకోవడం కాదు.. దగ్గరుండి పనులు పూర్తి చేయించండి
*పంటలు ఎండి బోర్ మంటున్న సాగర్ ఎడమ కాలువ ఆయ కట్టు రైతాంగం. మల్లయ్య యాదవ్
Bollam Mallaiah Yadav: ప్రజా దీవెన, కోదాడ:నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని పూడ్చడంలో తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి (Uttamkumar Reddy) పూర్తిగా విఫలం చెందారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ (Bollam Mallaiah Yadav) ఘాటుగా విమర్శించారు. మంగళవారం కోదాడ మండలంలో గణపవరం, ఎర్రవరం, రామ లక్ష్మి పురం, బిక్య తండా , తొగర్రాయి గ్రామాలలో ఎడమ కాలువ ఆయ కట్టు కింద ఎండిపోతున్న వరి పొలాలను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు.ఇ సందర్భంగా మాట్లాడుతూ గండి పడడం ద్వారా మునిగింది 500 ఎకరాల పొలం అయితే గండి పూడ్చడంలో విఫలం చెందడం వల్ల 50 వేల ఎకరాల వరి పొలాలు ఎండిపోతున్నాయన్నారు.
గండిపడి 12 రోజులు దాటిన నేటి వరకు పనులు పూర్తి కాకపోవడం ప్రభుత్వానికి రైతాంగం పై (The peasantry)ఉన్న నిర్లక్ష్యం అని ధ్వజమెత్తారు వారం రోజుల్లో గండి పూడిపిస్తానని ఇచ్చిన హామీని మంత్రి ఉత్తం నిలబెట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. వేల రూపాయలు అప్పులు చేసి గత మూడు నెలలుగా శ్రమించి వరి పంట సాగు చేసిన రైతాంగానికి కడగండ్లు మిగిలిచ్చారని విమర్శించారు. రెండుసార్లు పర్యటించానని ప్రకటించుకోవడం కాదని గండి ని దగ్గరుండి పూడిపించాలని డిమాండ్ చేశారు. టెండర్ల పేరుతో కమిషన్ల కోసం కాలయాపన చేస్తూ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్న పాలకులపై రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.రైతులకు బి ఆర్ ఎస్ పా ర్టీ (BRS party) అండగా ఉంటుందని యుద్ధ ప్రాతిపదికన గండి పూర్తించకపోతే రైతంగంతో కలిసి పెద్ద ఎత్తునఆందోళన చేస్తామన్నారు. నీళ్లు లేక ఎండిపోతున్న పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడమ ఆయకట్టు రైతులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.