*పథకాలు అమలు చేయడంలో వైఫల్యం చెందటంతో మంత్రులను నిలదీస్తున్న పరిస్థితి
*ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని మాట తప్పిన ముఖ్యమంత్రి
కోర్టు తీర్పు పట్ల గౌరవం లేని కాంగ్రెస్ బిజెపి నాయకులు
*కడిగిన ముత్యముల బెయిల్ పై వచ్చిన కవితమ్మ
Bollam Mallaiah Yadav: ప్రజా దీవెన, కోదాడ: అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలల కాలంలోనే ఇచ్చిన హామీలను అమలు చేయలేక విఫలమైందని అందుకే అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పాలన పట్ల విరక్తి కలిగిందని కోదాడ నియోజకవర్గ టిఆర్ఎస్ ఇంచార్జి. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ (Bollam Mallaiah Yadav)తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు….. బుధవారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మంత్రులు సీతక్క జూపల్లి కృష్ణారావు ఉత్తంకుమార్ రెడ్డి తుమ్మలనాగేశ్వరరావు లను రైతులు ప్రజలు నిలదీసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.. ఆగస్టు 15లోగా ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మబలికిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) మాట తప్పారని ఏ గ్రామంలో అయినా 35 నుంచి 40% వరకు మాత్రమే రుణమాఫీ అయిందని ఈ అంశం పట్ల అన్నదాతలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నాము రా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.. వ్యవసాయ అధికారులు కలెక్టర్ల వద్ద సైతం స్పష్టమైన సమాచారం లేదని. రైతులు బ్యాంకు లో వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దుస్థితి ఏర్పడిందన్నారు..
రుణమాఫీ పట్ల మంత్రులు పొంతననేని వ్యాఖ్యలు చేయటమే వారికి చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతుందన్నారు…. హామీలు అమలు చేయలేక టిఆర్ఎస్ పై అసంబద్ధ పర్యావరణ చేస్తున్నారని ఇక వాటిని మానుకొని ప్రజల సంక్షేమ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆరికట్టుకు నీరందక పంటలు ఎండిపోయే దశలో ఉన్న క్రమంలో ఇక్కడి నుండి పోలీసుల పహారాలో మంత్రి తుమ్మల సాగునీటిని తరలించకపోతుంటే జిల్లా మంత్రులు కోమటిరెడ్డి (komati reddy) ఉత్తములు పెదవి విప్పలేదని మండిపడ్డారు.. హైడ్రాను తాము స్వాగతిస్తున్నామని అయితే ప్రతిపక్షాలే టార్గెట్గా దుశ్చర్యలు ఉంటే ఊరుకో బోమన్నారు… గ్రామాలు పట్టణాలలో పారిశుద్ధ్య లోపంతో ప్రజలు విష జ్వరాలతో రోగాల బారిన పడ్డారని ప్రభుత్వ దవకానాలలో మందులు కూడా కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే నేతలు కేటీఆర్ హరీష్ రావులు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ (demand)చేస్తున్నారన్నారు.. వెంటనే ప్రజల ఆరోగ్యంపై చర్యలు తీసుకోవాలన్నారు.. కక్ష సాధింపు చర్యతో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను తమ జేబు సంస్థలు గా మార్చుకొనిఅక్రమ కేసులు బరాయించి జైలుకు పంపినప్పటికీ కవితమ్మ కడిగిన ముత్యంలా బెయిల్ పై బయటకు వచ్చిందని పేర్కొన్నారు…. కవితమ్మ బెయిల్ పై కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ (bandi sanjay) కాంగ్రెస్ నాయకులు అక్కసుతో చేస్తున్న అపరిపక్వ వ్యాఖ్యలు కోర్టు తీర్పును అపహాస్యం చేసినట్లేనన్నారు … ఈ విలేకరుల సమావేశంలో చిలుకూరు నడిగూడెం మండల పార్టీ అధ్యక్షులు జానకి రామాచారి భూపాల్ రెడ్డి , సీనియర్ టిఆర్ఎస్ నాయకుడు పైడిమరి సత్యబాబుపట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ అఫ్జల్ ..వెంపటి నాగమణి కట్టెకోల వెంకట్ రాంబాబు మాదాల ఉపేందర్ ఎస్కే అబ్బు బోసు పాల్గొన్నారు