రుణమాఫీ మీది వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు మాటలన్నీ నీటి మూటలు
*గ్రామంలో 100% రుణమాఫీ జరిగిందో నిరూపించాలి వ్యవసాయ శాఖ మంత్రి
Bollam Vallaiah Yadav : ప్రజా దీవెన,కోదాడ: రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి మోసపూరితంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని అధికారములోకి వచ్చిన కాంగ్రెస్ ఆలోచన విధానల వలన రైతన్నలకు కన్నీళ్లే మిగిలాయని కోదాడ మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ బొల్లం వల్లయ్య యాదవ్ అన్నారు శుక్రవారం పట్టణంలోని ఆయన నివాస గృహములో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గాలలో లిఫ్ట్ లా పేరిట కోట్ల ప్రజాధనం వెచ్చించిన ప్రకటనలు ఇస్తారు, కానీ ఒక్క లిఫ్టు పూర్తి చేయలేదని తెలిపారు .
మోతె మండలానికి లిఫ్టు అని ప్రచారం చేసుకున్నారు గానీ, మోతెకి లిఫ్ట్ వచ్చింది లేదు, రైతన్నల పంట పొలాలకు నీళ్లు కాదు, తాగునీరు ఇవ్వలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో మీరు ప్రకటించిన మాదారం లిఫ్ట్, రెడ్లకుంట్ల లిఫ్టు, సింగారం లిఫ్టు ఏమయ్యా వి, వాటి ద్వారా రైతన్న పొలాలకు నీరు అందలేదు కానీ , ఆ లిఫ్ట్ లా పేరుతో ఉత్తంకుమార్ రెడ్డి సంచులు నింపుకున్నారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ మాటలు నమ్మి నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏం కావాలి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రశ్నించారు SRSP స్టేజ్ -2 లో భాగంగా తుంగతుర్తి, సూర్యపేట, కోదాడ తదితర నియోజకవర్గాల్లోని 3,36,630 ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తామని ప్రకటనల్లో పేర్కొన్నారని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవు అని మరోసారి రుజువైంది.
తెలిపారు మంత్రులు గాలి మోటర్ లో తిరుగుతూ అద్భుతాలు చేస్తున్నట్లు భ్రమలు కల్పించడం మానేసి, ఇప్పటికైనా గ్రామాల్లో తిరిగి అభివృద్ధికి పట్టం కట్టాలని తెలిపారు.రాజకీయ కక్ష సాధింపు చర్యలు, ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం మానేసి, పంట పొలాలకు నీళ్లు అందించండి. ఆందోళనలో ఉన్న రైతన్నకు దన్నుగా నిలవండిని హితవు పలికారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో కోదాడ మున్సిపాలిటీని సెంటర్ లైటింగ్ సిస్టంతో అన్ని రంగులతో తీర్చిదిద్దామనిఅలాగే కోదాడ మున్సిపాలిటీలోని పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా వారిని పక్కన పెట్టి, వారు స్వార్థ కమిషన్ల కోసం కోదాడ మున్సిపాలిటీని మురికి కోపంగా మారుస్తున్న ఘనత ఉత్తంకుమార్ రెడ్డి దంపతులకు దక్కుతుందని తెలిపారు .
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోదాడ పట్టణంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు కరెంటు శాంక్షన్ చేయించారు కానీ, కమిషన్ వచ్చే పనులు మాత్రం చేస్తారని మార్కెట్ అభివృద్ధి చేస్తామని చెప్తున్నా ఈ మంత్రి గతంలో కోదాడ మార్కెట్లు గెస్ట్ హౌస్ లను పేకాట క్లబ్బులు , మద్యం వ్యసనపరులకు నిలయంగా మార్చాన ఘనత ఉత్తంకుమార్ రెడ్డిదని తెలిపారు.