*రైతు రుణమాఫీ, బోనస్ డబ్బులను వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలి
బొల్లు ప్రసాద్
Bollu Prasad : ప్రజా దీవెన,కోదాడ: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ తక్షణమే అమలు చేయాలని సిపిఐ రైతు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సూర్యనారాయణ ను కలిసి వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుంచి నాలుగు పథకాలను అమలు చేస్తామని చెప్పి నేటికీ అమలు చేయకుండా మండలంలో ఒకే గ్రామానికి అమలు చేయడం సరి కాదన్నారు.
అదేవిధంగా వానాకాలంలో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి నేటికి కూడా కొంతమంది బోనస్ రాని రైతులు ఉన్నారని రెండు లక్షల దాటిన వారికి రుణమాఫీ వర్తింపజేసి తక్షణమే ప్రభుత్వం వారి ఖాతాలో నిధులను జమ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డ వెంకటయ్య, సిపిఐ కోదాడ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు, శ్రీనివాసరావు, ఏలూరి నాగయ్య, సామినేని సుబ్బారావు, కనగాల కొండయ్య, అలవాల గురవయ్య, తూమాటి రామారావు తదితరులు పాల్గొన్నారు.