ప్రజా దీవెన, కోదాడ: కోదాడ ప్రాంత సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ కమతం రాఘవయ్య ఆశయాలను సాధిద్దామని జిల్లా రైతు సంఘం నాయకులు బొల్లు ప్రసాద్ కోదాడ ప్రాంత సిపిఐ సీనియర్ నాయకులు పోతురాజు సత్యనారాయణ అన్నారు కమతం రాఘవయ్య 34 వర్ధంతి సందర్భంగా పట్టణంలోని స్థానిక తమ్మర బండ పాలెం లో ఉన్న రాఘవయ్య స్తూపానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు, ముందుగా సిపిఐ జెండాను పోతురాజు సత్యనారాయణ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బొల్లు ప్రసాద్ మాట్లాడుతూ కమతం రాఘవయ్య కోదాడ ప్రాంతంలో , తమ్మరబండ పాలెం లో కమ్యూనిస్టు పార్టీబలోపేతానికి ఎనలేని కృషి చేశారని ఆయన కోదాడ ప్రాంతంలో ఎంతో మంది నాయకులను కార్యకర్తలను సిపిఐ సైనికులుగా తయారు చేశారని కొనియాడారు ఆయన పార్టీకి చేసిన కృషి మరువలేనిది అని తెలిపారు నేటి యువత రాఘవయ్యగారి ఆశయాలను సాధించిన నాడే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళులు అని తెలిపారు.
తమ్మర సిపిఐ శాఖ కార్యదర్శి మాతంగి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బత్తినే హనుమంతరావు, బతినేని అఖిల్, పోతురాజు సత్యనారాయణ ,బొల్లు ప్రసాదు, కొండ కోటేశ్వరరావు నిడిగొండ రామకృష్ణ ,కమతం పుల్లయ్య, పసుపులేటి గోవిందరావు, కమతం సైదయ్య ,మల్లారెడ్డిగూడెం బాబు మాతంగి ఏసు, తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
