అకాల వర్షంతో రైతులకు తీరని నష్టం.
*ఎకరాకు 20000 ప్రభుత్వం పరిహారం చెల్లించాలీ. బొల్లు ప్రసాద్.
Bollu Prasad: ప్రజా దీవెన, కోదాడ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షంతో నష్టపోయిన రైతులను (farmers)ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ (Bollu Prasad)ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కోదాడ పరిధిలోని తమ్మరలో వరద ఉధృతికి నీట మునిగిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెరువుకు విపరీతమైన వరదరావడంతో వరద వెళ్లే మార్గం లేక చెరువు (the pond)నుండి తూము కి వెళ్లే కాలువకు గండి పడటంతో గ్రామానికి చెందిన కెవిఎల్ ఎన్ ప్రసాద్ పొలంలో ఇసుక మేటలు వేయడంతో రైతు (farmer) తీవ్రంగా నష్టపోయారు. అదేవిధంగా గ్రామంలో 500 ఎకరాల వరకు వర్షం నీటితో (Rain water)మునిగిపోయి రైతులు, ముఖ్యంగా కౌలు రైతులకు తీరని నష్టం కలిగిందని ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులతో అంచనా వేయించి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు కే వి ఎల్ ఎన్ ప్రసాద్, మాతంగి ప్రసాద్, రాధాకృష్ణ, బత్తిని రమేష్, బొల్లు నరేష్, సామినేని నరసింహారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.