తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం
Bomma Mahesh Kumar Goud : ప్రజాదీవెన,హిమాయత్ నగర్ : టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్బార్టర్స్ లో కలిసిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ వినతిపత్రం అందజేశారు.కాంగ్రెస్ పార్టీ మ్యానిపేస్టోలో ప్రకటించినట్లుగా కాంగ్రెస్ జాతీయ నాయకులు పార్లమెంట్ పక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక న్యాయ సాధన ఆలోచన మేరకు
స్థానిక సంస్థల్లో, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్,మునిసిపాలిటీలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిచాలి.
కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలి.ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్& టీచర్లు ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు టికెట్స్ కేటాయించాలి.మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సిస్(బీసీ విదేశీ విద్యానిది స్కిం)గత ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్న నిధులు వెంటనే విడుదల చెయ్యాలి.బీసీ విద్యార్థుల ఫీజు రిఅంబేర్స్మెంట్, స్కాలర్షిప్స్ పెండింగ్ బకాయిలు వెంటనే రేలీజ్ చెయ్యాలి, రాష్ట్రంలోనీ కాంట్రాక్టుల్లో 42% బీసీ లాకు కేటాంచాలి.
మరియు అనేక సమస్యలు పై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ” పేదల రిజర్వేషన్ పోరాట సమితి” రాష్ట్ర అధ్యక్షులు( పిఆర్పిఎస్) గిరగాని భిక్షపతి గౌడ్, టీవీసీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీహరి గౌడ్, టీబీసీ రాష్ట్ర కార్యదర్శి తౌటం సత్యం నేత, మహేష్ ముదిరాజ్ ,రాకేష్ యాదవ్ , అభిషేక్ పటేల్, సలీమ్ పైల్మాన్, లక్మి ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.