Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bonala Jatara: ఉత్తేజంగా, ఉత్సాహంగా ఉజ్జయిని మహంకాళి బోనమెత్తిన లష్కర్

–వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు మహోత్సవం
–అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణ
–తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
–ఎడతెరిపిలేని ముసురులోనూ మురిసిపోతూ తరలివచ్చిన భక్తు లు

Bonala Jatara: ప్రజా దీవెన, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి (Secunderabad Ujjain Mahankali )అమ్మ వారి బోనాలు భోగభాగ్యాలతో విరా జిల్లుతున్నాయి. ఉజ్జయిని మహంకాళి బోనాల (Ujjain Mahankali Bonala) మహోత్సవానికి ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయా నికి చేరుకున్న ఆయనకు అర్చ కులు వేదమంత్రాలతో ఘన స్వాగ తం పలికారు. అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆశీ ర్వచ నాలు, తీర్థప్రసాదాలు అందజే శారు. అనంతరం అమ్మ వారికి సీ ఎం పట్టువస్త్రాలు సమర్పించి ప్ర త్యేక పూజలు నిర్వహించారు. బో నాల సందర్భంగా ముఖ్య మంత్రి ట్వీట్ చేశారు. ఉజ్జయిని మహం కాళి అమ్మవారి చల్లని చూపుతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

రైతులు పాడి పంట లతో, యువత శక్తి సామర్థ్యా లతో, మహిళలు ఆర్థిక స్వావలం బనతో, పేదల జీవన ప్రమాణాలు మెరు గుదలతో యావత్ రాష్ట్రంలో సమ స్త ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లా లని కోరుకుంటున్నానని ఆ తర్వాత తన వ్యక్తిగత అకౌంట్ లో ట్వీట్ చేశారు. మరోవైపు వర్షంలో నూ అమ్మ వారిని దర్శించుకునేం దుకు ఉదయం నుంచే భక్తులు ఆలయా నికి భారీగా తరలి వస్తుండడంతో దర్శన క్యూ లైన్లు కిటకిటలాడు తున్నాయి.

బోనాల సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశా రు. ఉజ్జయిని మహంకాళి ఉత్సవా ల్లో భాగంగా సికింద్రాబాద్‌లో ఉజ్జ యిని మహంకాళి బోనాల పండగ ఘనంగా కొనసాగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తు న్నారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (Sitakka) మహాకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించు కున్నారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఉజ్జయిని మహంకాళి బోనాల (Ujjain Mahankali Bonala) ఉత్సవాలు జరుపుకునే పవిత్రమైన రోజున అమ్మవారిని దర్శించుకో వడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో వందల ఏళ్లుగా బోనాల ఉత్సవాలు జరుపు కుంటున్నామని తెలిపారు. ఎవరు ఏ రంగంలో ఉన్నా ఎంత స్థాయిలో ఉన్నా దేవతలను పూజించే విధానాలు ఒకేలా ఉంటాయ న్నారు.

మన సంస్కృతి సంప్రదా యాలను కాపాడుకుందామని మంత్రి తెలిపారు. భక్తుల సౌకర్యా ల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని అధికారులను సీతక్క ఆదేశించారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించు కున్నారు. పట్టువస్త్రాలతోపాటు అమ్మవారికి తొలి బోనం సమర్పిం చారు. బోనాల జాతర సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ పరిసరాల్లో సందడి నెల కొన్నది. భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

కిషన్ రెడ్డి (kisan reddy) దంపతుల ప్రత్యేక పూజలు …సికింద్రాబాద్ ఉజ్జ యిని మహంకాళి అమ్మవారి బోనా ల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఉజ్జయిని మహం కాళి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు.ఈ సంద ర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు మన రాష్ర్టంలో కొన్ని వందల సంవత్సరాల నుండి బోనాల పండుగ సంప్రదాయం కొనసాగుతోందని, దేశంలో ఎక్కడా లేని విదంగా బోనాల పండుగ మన కు మాత్రమే ప్రత్యేకమని పేర్కొ న్నారు. ముఖ్యంగా నగరంలో సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు మరీ మనకు ప్రత్యేకమని, రాష్ట్రం దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మ హంకాళి అమ్మవారిని కోరు కున్నానని చెప్పారు.