ప్రజా దీవెన, హనుమకొండ:హనుమకొండ జిల్లా ఏకాశిల పార్క్ ధర్నా చౌక్ నందు బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు శ్రీ జక్కని సంజయ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సత్యా గ్రహ దీక్షలో పాల్గొన్న తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొనగాని యాదగిరి గౌడ్ ఈ సందర్భంగా యాదగిరి గౌడ్ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతానికి వాటా పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలు అమలుపరచాలని అన్నారు.
పల్లె పల్లెనా బీసీ నినాదాన్ని చాటేలా బీసీలు సంఘటీతం కావాలని, బీసీ లందరు కలిసి పోరాడి రాజ్యాధికారం సాదించాలని కోరారు. ఈ కార్యక్రమం లో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణు గోపాల్ గౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు చంద మల్లయ్య, బీసీ ఐక్య సంఘర్షణ సమితి అధ్యక్షులు ఎదునూరి రాజమౌళి, ఎరుకొండ పవన్ కుమార్ గౌడ్, బి ఆర్ ఎస్ నాయకురాలు పుస్పిత లయా, బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వ్యాసబట్టు మధుసూదన రాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ జినుకల లక్ష్మణ రావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు గజవెల్లి మనోహర్, రాష్ట్ర కార్యదర్శి బోయిని సంపత్ ముదిరాజ్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఖ్యాతం మహేందర్, ములుగు జిల్లా అధ్యక్షులు ఊరకొండ మురళి గౌడ్, హనుమకొండ డివిజన్ అధ్యక్షులు మహేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.