మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
Boora Narsaiah Goud: ప్రజా దీవెన మునుగోడు అక్టోబర్ 10 :భారతదేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ పరిపాలనను కోరుకుంటున్నారని మాజీ పార్లమెంటు సభ్యుడు విశ్వకర్మ యోజన రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ (Boora Narsaiah Goud) అన్నారు. మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అవుట్ లుక్ జెట్ మెన్స్ వేర్ ను ప్రారంభించారు అనంతరం ప్రజా దీవెన ప్రతినిధితో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ముందుచూపు ఆలోచనల భాగంగా విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారని దీనివల్ల దేశంలోని కులాల వ్యక్తులు తమ వృత్తి పని శిక్షణ పొంది కోట్ల రూపాయల టర్నోవర్ సాగిస్తున్నారని చెప్పారు ఈ పథకం నిరంతరంగా కొనసాగుతుందని మన జిల్లాలో నల్లగొండ మిర్యాలగూడ ప్రాంతాలలో శిక్షణ శిబిరాలు ఏర్పాటయ్యాయని మన నాంపల్లి మన నాంపల్లి మండలం (Nampally Mandal) నుండి అన్ని వృత్తుల వారు శిక్షణ పొంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాంపల్లి శాఖ నుండి రుణాలు పొందారు అని చెప్పారు.
ఈ రుణాలు 18 నెలలు చెల్లించి ఇంకా అదనంగా శిక్షణ పొందు లక్షల రూపాయలు పొంది అభివృద్ధి చెందాలని కోరారు వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎందుకు మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించి దేశంలోని తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంటుందని అందుకు ప్రతి కార్యకర్త సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు ఏ రెడ్ల శ్రీనివాస్ రెడ్డి బీజేవైఎం నాయకులు పానుగంటి మహేష్ గౌడ్ బీజేవైఎం మండల శాఖ అధ్యక్షులు సతీష్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి శ్రీశైలం నాయకులు కర్ణాటక శ్రీహరి మెన్స్ వేర్ యజమాని పోలగొని శ్రీకాంత్ గౌడ్ (Srikanth Goud) మరియు నాయకులు మారుపాకులు రాములు గౌడ్ పాల్గొన్నారు అనంతరం పార్లమెంట్ సభ్యుడు ఊర నర్సయ్య గౌడ్ చేతుల మీదుగా సభ్యత్వాలు కార్యకర్తలు అందుకున్నారు