— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజా దీవెన, వేములపల్లి: పారద ర్శక ఓటరు జాబితా తయారీలో బూత్ స్థాయి అధికారుల(బిఎల్ఓ) పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.కేంద్ర ఎన్నికల సం ఘం ఆదేశాల మేరకు బూత్ స్థాయి అధికారులకి ఇస్తున్న శిక్షణ కార్యక్ర మాలలో భాగంగా గురువారం న ల్గొండ జిల్లా 88- మిర్యాలగూడ అ సెంబ్లీ నియోజకవర్గం వేములపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిఎల్ ఓలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కా ర్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు.
తప్పులు లేని,పారదర్శక ఓటరు జాబితా తయారీలో బిఎల్ ల పాత్ర ప్రధానమని, ఓటరు జాబితా త యారీలో అన్ని అంశాలను క్షుణ్ణం గా పరిశీలించి జాబితా రూపొందిం చాలని, ప్రజాస్వామ్యానికి ఓటరూ జాబితా ముఖ్యమని, అర్హులు మా త్రమే ఓటరుగా ఉండేలా చూడాల ని, నాయకుల ఎంపికలో ఇది ప్ర ముఖ పాత్ర పోషిస్తుందని తెలిపా రు. అభివృద్ధి చెందిన ప్రజాస్వా మ్యమైన భారత దేశంలో ఎన్నికల్లో ఓటరు జాబితా కీలకమన్నారు.
శిక్షణ కార్యక్రమాన్ని బిఎల్ ఓలు స ద్వినియోగం చేసుకోవాలని కోరా రు. శిక్షణ సందర్భంగా సిబ్బందికి అ వసరమైన అన్ని సౌకర్యాలు కల్పిం చాలని ఆమె అధికారులను ఆదేశిం చారు. వేములపల్లి తహసిల్దార్ హే మలత, మాస్టర్ ట్రైనర్లు, తదిత రులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజ రయ్యారు.