–డీసీసీ ఉపాధ్యక్షులు అన్నె బొయిన సుధాకర్
Boya Sudhakar: ప్రజా దీవెన, శాలిగౌరారం: ఎమ్మెల్యే సామేల్ పై చేస్తున్న ఆరోపణలను మానుకోవాలని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అన్నేబోయిన సుధాకర్ (Boya Sudhakar), బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బండపెల్లి కొమరయ్య,నాయకులు భూపతి వెంకన్న లు అన్నారు.శాలిగౌరారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ నియోజకవర్గం లో లేని విధముగా తుంగతుర్తి నియోజకవర్గ వర్గంలో దళిత ఎమ్మెల్యే ను చూసి ఓర్వలేక స్వంత పార్టీ నేతలే ఎమ్మెల్యే కు, పార్టీకి (To the MLA, to the party)విరుద్ధంగా వ్యహరించడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి ని ,ప్రజా ఆదరణ చూసి కుట్ర పడుతున్నారని ఆరోపించారు. జాజిరెడ్డిగూడెం మండలానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే తెలియకుండా సభలు సమావేశాలు పెట్టడం పద్ధతి కాదన్నారు.
కొంత మంది వ్యక్తులు కావాలని పనిగట్టుకుని పదే పదే చేస్తున్న అసత్యమైన ఆరోపణలను దుష్ప్రచారాన్ని మానుకోవాలన్నారు. ఎమ్మెల్యేను విమర్శిస్తే పెద్ద నాయకులం అవుతామని అనుకోవడం సరికాదన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ భూపతి అంజయ్య, మాజీ సర్పంచ్ లు అల్లి సైదులు (Alli Saidul) ననుబోతు అంజయ్య మాదగోని అంజయ్య,పుల్లూరి దేవేందర్, వేముల గోపీనాథ్,దొంతురి శంకర్, తోటకూరి పరుశురాం, బండమిది రమేష్, పడాల రమేష్, ముత్తయ్య, ఇంధనూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.