Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bridge collapse: గాలి వానలకు పేకమెడల్లా కూలిన బ్రిడ్జి

–మరోసారి కూలిన భూపాలపల్లి మానేరువాగుపై గిడ్డర్లు
–కొట్టొచ్చినట్టు కనబడుతున్న నిర్మాణ నాణ్యత లోపం

Bridge collapse: ప్రజా దీవెన, భూపాలపల్లి: రాష్ట్రం లో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్లో, వేబ్రిడ్జిల్లో నాణ్యత లోపాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపం విషయంలో రాష్ట్రం లో రాజకీయ రగడ కొనసాగుతుం డగా తాజాగా బ్రిడ్జి (bridge)పేక మేడల్లా కుప్పకూలడం గమనార్హం. జయశం కర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ వద్ద, టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మ ధ్య మానేరువాగుపై గిడ్డర్లు మరోసా రి కుప్పకూలాయి. దాదాపు తొమ్మి దేళ్లుగా నత్తనడకన సాగుతున్న వం తెన నిర్మాణంలో (bridge construction) నాణ్యతలోపం మరోసారి తేటతెల్లమైంది. మంగ ళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17, 18 నంబరు పిల్లర్లపై ఐదు గడ్డ ర్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. గాలి దు మారం రావడంతోనే గడ్డర్లు కూలి పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోం దని పెద్దపల్లి జిల్లా ఆర్ అండ్ బి అధికారి, ఈఈ నర్సింహా చారి (Narasimha chari)పేర్కొన్నారు. అధికారులను క్షేత్ర స్థాయికి పంపి ఘటనకు గల కార ణాలు తెలుసుకుంటున్నామని చెప్పారు.

2016 ఆగస్టులో సుమా రు రూ.49 కోట్ల అంచనా వ్యయం తో వంతెన పనులు ప్రారంభించా రు. నిర్మాణ సమయంలో పలుమా ర్లు వచ్చిన వరదలకు సామగ్రి దెబ్బ తినడం, గుత్తేదారులు మారడంతో పనులు ఆలస్యమయ్యాయి. రెండే ళ్లుగా వాగు ఉద్ధృతంగా ప్రవహించ డంతో గడ్డర్లకు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1, 2 నంబరు పిల్లర్లలో మూడు గడ్డర్లు కింద పడ్డాయి. దీం తో భూపాలపల్లి మీదుగా పెద్ద పల్లి జిల్లాకు వెళ్లాలంటే సుమారు వంద కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉం టుంది. అలా కాకుండా బ్రిడ్జి పూర్తై తే కేవలం 30 కిలోమీటర్ల దూరానికి తగ్గిపోతుంది.ప్రత్యామ్నాయంగా వాగు గుండా మట్టి రోడ్డు నుంచి ప్రజలు రాకపోకలుకొనసాగిస్తున్నా వర్షాకాలం కొట్టుకుపోతుండడంతో ఇబ్బందులు నిత్యకృత్యమయ్యా యి.