–సీఎం వ్యాఖ్యలపై విపక్ష నేతల నిరసన
–సభ నుంచి వాకౌట్ అసెంబ్లీ ఎదుట ఆందోళన
BRS: ప్రజా దీవెన, హైదరాబాద్: అసెంబ్లీ (Assembly) ఎదుట మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ వెనకాల ఉన్న అక్కలు మోసం చేస్తారంటూ చేసిన వ్యాఖ్యలపై గురువారం బీఆర్ఎస్ సభలో నిర సన తెలిపింది. మహిళా సభ్యుల (of female members)ను సీఎం అవమానించారని, వెంట నే క్షమాపణలు చెప్పాలని పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణపై (Classification of SC)మాట్లాడటానికి మైక్ ఇస్తామని స్పీకర్ చెప్పడంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ లో సీఎం ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి క్షమా పణ చెప్పేవరకు ఆందోళన కొనసా గిస్తామని తేల్చి చెప్పారు. దీంతో మార్షల్స్ (Marshalls)రంగంలోకి దిగి వారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపిం చారు. అనంతరం అసెంబ్లీ ముందు రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసు లు వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ (Police station) కు తరలించారు.