Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS: మేడిగడ్డ సందర్శనకు బిఆర్ఎస్

–ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల బృందం తో ఈ నెల 25,26 తేదీల్లో సందర్శనకు నిర్ణయం
–నిరుద్యోగ సమస్యలపై వాయిదా తీర్మానం ఫిరాయింపులపై ప్రత్యేక వ్యూహం
–పౌరసరఫరాల కుంభకోణం, బీర్ బ్రాండ్ల అనుమతులపై చర్చకు పట్టు
–బీఆరెస్ఎల్పీలో నిర్ణయాలను వెల్లడించిన మాజీ మంత్రి టి.హరీశ్ రావు

BRS: ప్రజా దీవెన, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీని బీఆరెస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల (BRS MLAs, MLCs) బృందంతో కలిసి ఈ నెల 25,26 తేదీల్లో సందర్శించాలని బీఆరెస్ ఎల్పీ (BRS LP) నిర్ణయించింది. శాసన సభ, మండలిలో అనుసరిం చాల్సిన వ్యూహాలపై బీఆ రెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆరెస్ ఎల్పీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసు కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటిని ఎత్తిపోయ కుండా దిగు వకు వదులుతుందని, ఎన్డీఎసీ సూచన మేరకు బ్యారేజీ రక్షణ, ప్రజా హితం దృష్టానే బ్యారేజీ గేట్లు (Barrage gates) తెరి చామనిచెబు తుందని బీఆరెస్ ఆరోపిస్తుంది. బ్యారేజీ వద్ద వాస్తవ పరిస్థితులను తెలుసుకుని ప్రజలకు చెప్పా లని బీఆరెస్ ఎల్పీ నిర్ణయించింది. అలాగే శాసన మండలి పక్ష నేతగా ఎమ్మెల్సీ మధుసూధనచారిని ఈ సమావేశంలో ఎంపిక చేశారు. మిగతా కార్యవర్గాన్ని తదుపరి ప్రకటించనున్నారు.

బీఆరెస్ ఎల్పీ (BRS LP) సమా వేశం వివరాలను మాజీ మంత్రి టి.హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లతో (Former Minister T. Harish Rao, Sabita Indra Reddy, Satyavathi Rathodla)కలిసి వివరిం చారు. కాంగ్రెస్, బీజేపీలకు చెరో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపిస్తే తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని హరీశ్ రావు విమర్శించారు. రేపు పార్లమెంటులో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపా లని డిమాండ్ చేశారు. ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత అదే రోజున మేడిగ డ్డ పర్యటనకు బీఆరెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల (BRS MLAs and MLCs)బృందం బయలుదేరు తుందని తెలిపారు. ఈ నెల 26న మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌజ్ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సంద ర్శిస్తుందని, లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వృథాగా పోతున్నా ఈ ప్రభుత్వం పంపుల ద్వారా నీళ్లు ఎత్తిపోయడం లేదన్నారు. మిడ్ మానేరు, కొండ పోచమ్మ సాగర్, రంగ నాయక సాగర్లలో నీళ్లు నింపి రైతుల పొలాలకు తరలించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచు తామన్నార. ప్రజా సమస్యలను లేవనెత్తేం దుకు బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కార్యాచరణ ఖరారు చేశామని తెలిపారు.

నిరుద్యోగుల సమస్యలపై (Unemployment problems)బుధవారం చర్చ కోసం రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో పాల్పడ్డ కుంభకో ణాలపై అసెంబ్లీలో నిలదీస్తా మన్నా రు. పౌరసరఫరాల శాఖలో కుంభకో ణాలు జరి గాయని, వాటిని లేవనె త్తుతామని, వేరే రాష్ట్రాల్లో నిషే ధించిన బీర్లను ఇక్కడ ప్రవేశపె ట్టేందుకు చేసిన ప్రయ త్నాల వెనుక ఉన్న అదృశ్య శక్తుల బండారాన్ని బయట పెట్టాలని అసెంబ్లీలో నిలదీ స్తామని చెప్పారు. మంత్రి కి తెలియ కుండానే నిషేధిత బీర్ల ప్రవేశం కోసం ప్రయత్నం ఎలా జరిగింది అనే దాని పై చర్చకు పట్టుబ డుతామని, ఫీజు రీయింబర్స్మెంట్ (Reimbursement of Fees) బకాయిల చెల్లిం పుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో మిగిలిపోయిన ఫీజు రీయింబ ర్స్మెంట్ బకాయిలు మేము చెల్లిం చామని, ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగు లను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించే ప్రక్రియలో జాప్యంపై నిలదీస్తామని, రైతు భరోసా ఆలస్యంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని, ఫిరాయింపులపై అసెంబ్లీలో ప్రత్యేక వ్యూహం తో ముందుకు వెళ్తామ న్నారు. కేసీఆర్ అన్ని అంశాలపై మాకు దిశా నిర్దేశం చేశారని, కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసమే కేంద్ర మంత్రులతో భేటీలు అన్న రేవంత్ ఇప్పుడు ఏం చెబుతారని నిల దీశారు. రాహుల్ గాంధీ తెలంగా ణకు జరిగిన అన్యాయంపై మాట్లా డరా రాహుల్ గాంధీతో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రేవంత్ మాట్లాడిం చాలని బీఆరెస్ డిమాండ్ చేస్తుందన్నారు. ప్రధాని కార్యాలయం ముందు కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేయా లని, పార్లమెంటు పోడియం దగ్గరికి వెళ్లి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నిరసన తెలపాలని కోరారు. ముందస్తు అనుమతితోనే కొందరు ఎమ్మెల్యేలు ఈ రోజు భేటీకి హాజరుకాలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కోవా లక్ష్మి, విజయుడు. ఎమ్మెల్సీ సురభి వాణి దేవి (Chinta Prabhakar, Kova Lakshmi, Vijayudu. MLC Surabhi Vani Devi) పాల్గొన్నారు.