హరీష్ ఆగ్రహం…’మూసి’పై దేశాన్నే తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వం
ప్రజా దీవెన, హైదరాబాద్: మూసీ బాధితులకు పునరావాసం విష యంలో రాష్ట్ర ప్రభుత్వం కేం ద్రాన్ని, పార్లమెంట్ ను, దేశాన్ని తప్పు దోవ పట్టించడం సిగ్గు చేటని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. భూ సేకర ణ చట్టం 2013 ను అమలు చేస్తున్నా మని పచ్చి అబద్దం చెప్పారని, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై వాస్త వాలను దాచిపెడుతున్నదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లా డారు.
పార్లమెంట్ లో మా ఎంపీ కేఆ ర్ సురేశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానంతో రాష్ట్ర కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బయటపడిందని, కేంద్రానికి చెబుతున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నది మరొకటి భూసేకర ణ చట్టం 2013 కంటే మెరుగైన చట్టా న్ని కేసీఆర్ రూపొం ది అమలు చేసారని గుర్తు చేశారు. ఆయన కూడా ఒక నిర్వాసిత కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి నిర్వా సి తుల గురించి ఆలోచన చేశారని నిర్వాసితులకు 121 గజాల స్థలం లో ఐఏవై ఇళ్లు కట్టించా లని 2013 చట్టం చెబితే, కేసీఆర్ 250 గజాల స్థలం, డబుల్ బెడ్ రూం ఇల్లు గా మార్చారని వివరించారు.
ఐఏవై ఇళ్లు అంటే ఆరోజు లక్షా 20వేల మాత్రమే మన డబుల్ బెడ్ రూం ఇల్లు అంటే 5,6 లక్షలు వేజ్ లాస్ కూడా పెంచడం జరిగిందన్నా రు. కానీ ఇప్పుడు మూసి విష యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని త ప్పుదోవ పట్టించే విధంగా వ్యవ హరిం చిందని, నష్టపోతున్న బాధి తులను ముందు గుర్తించాలని, అలా ఎక్కడా చేయలేదని దుయ్యబ ట్టారు. అసైండ్ భూమి అయినా, ఎన్ క్రోచ్ మెంట్ అయినా, పట్టా భూమి అయినా, ప్రభుత్వ భూమిలో ఉన్నా అందరికి సమాన హ క్కు లు ఉంటాయని చట్టం చెప్పిందని, ముందుగా ఎనుమరేషన్ జర గా లని 60 రోజుల సమయం ఇస్తూ దినపత్రికల్లో నోటీసు ఇవ్వాలని, వచ్చిన అభ్యంతరాలను పరిగణ లోకి తీసుకొని పరిష్కరించాలి అప్పుడు ప్రక్రియ ప్రారంభించాలి. కానీ ఇక్కడ నోటీసులు లేవని, డీపీఆర్ లేవు, ఎనుమరేషన్ లే దు,ఇవేవి లేకుండా ఇండ్లు కూల గొట్టి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, పాల మూ రు ఎత్తిపోతలలో గానీ, సీతా రామ లో గానీ అనేక ప్రాజెక్టుల్లో మేము తెచ్చిన 2014 చట్టం అమలు చేసామని, చట్టం ప్రకారం, ముందు గా పబ్లిక్ నోటీసు ఇవ్వాలని, అ భ్యంతరాలు పబ్లిక్ డొమైన్ లో పె ట్టాలని, పరిష్కరించి ముందుకు వెళ్లాలని, ఏ ఇల్లు అయినా ఆ ఇం టికి ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ అధికారులు వెళ్లి పాత ఇంటి కి ఎంత విలువ ఉంటుందో అంచ నా వేస్తారు కాబట్టి రెండింత లు డబ్బును ఇంటి యజమానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉపాధి కోల్పోయిన వారికి వేజ్ లాస్ కింద ఏడున్నర లక్షలు ఇవ్వాల ని, పెళ్లి కాని వారికి ఐదు లక్షలు ఇవ్వాలి పెళ్లి అయిన వారికి 250 గజాల స్థలం, డబుల్ బెడ్ రూం ఇవ్వాలని, ఆ ఇంటికి కరెంటు, రోడ్డు, ఆసుపత్రి దేవాల యాలు ఉండేలా కాలనీ నిర్మించి ఇవ్వాలని అప్పీల్ చేశారు.2014 చట్టంలో ఒక్కటీ అమలు కాలేదు.నిజానికి డబుల్ బెడ్రూం ఇళ్లను సేలబుల్ అంటే అన్ని హక్కులతో ఇవ్వాలి కానీ కేసీ ఆర్ కట్టించిన ఇండ్లను కేవలం అసైండ్ పేపర్ ఇచ్చి పంపించారని, అంటే వారికి ఆ ఇండ్ల మీద ఎలాంటి హక్కులు ఉండవని చెప్పారు.
ప్రజలను, పార్లమెంట్ ను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి
ము న్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి ఆయనే ఉండి ఆయనకు తెలిసి కూడా కేంద్రానికి తప్పుడు సమా చారం అందించారని విమర్శిం చా రు. ఖాళీ చేయించిన ఇళ్ళకి ఎవరు బాధ్యులు కొత్తవి మాత్రమే కూ ల్చము అని చెబుతున్నరని, మరి ఇప్పటికే కూల్చిన ఇండ్ల సం గతి ఏమిటి వాళ్లు అనుభవించిన క్షోభ సంగతి ఏమిటి హైడ్రా పేరిట పే దల ఇండ్లు కూల్చారన్నారు.
చిన్న పాప పుస్తకాలు తెచ్చుకుంటా అం టే ఊరుకోలేదని, ఇండ్లు కూ ల్చారు. ఎవరు బాధ్యులు కంపె న్సేషన్ ఇచ్చినా వారు పడిన బాధ పోదని, కట్టుబట్టలతో ఇండ్ల నుంచి బయ ట కు గెంటేసారు మూసీ విష యంలోనూ అదే పరిస్థితి అని అoదో ళన వ్యక్తం చేశారు. కూలి న ఇండ్ల కు నష్టపరిహారం ఎలా చెల్లిస్తావు దుందుకుడు చర్యలతో పేదల ఉసురు పోసుకుంటున్నవు అని విమర్శించారు.
మరికొన్ని వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే… రాష్ట్రం పరువు తీస్తు న్నావు 280 కుటుంబాల ఇండ్లు కూల్చేసిన అని అంటున్నారు, ఓల్డ్ మలక్ పేటలో ఓ ఇంట్లో 16 మంది ఉంటే, వీరు వెళ్లి కూలగొట్టారు. వారికి కేసీఆర్ కట్టించిన ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చి వెళ్లి పోం డి అన్నరు. మానవత్వంతో ఇండ్లు ఇస్తున్నం అని పార్లమెంట్ కు చెప్పినవు. మానవత్వం కాదు హక్కుగా ఇవ్వాలి వాళ్లకువరంగల్ లో సీఎం మాట్లాడుతూ సోనియా కాలు కడిగి నెత్తిల పోసుకుంటా అన్న డు గతంలో బలిదేవత అన్న డు ఇప్పుడు తల్లి అంటున్నడునిజంగా ఆమె మీద గౌరవం ఉంటే భూసేకరణ చట్టం 2013ను అమలు చెయ్యి మూసీ బాధితులకు పరిహారం విషయంలో పార్లమెంట్ కు చెప్పిన అంశాలపై చర్చించేం దుకు నేను సిద్ధం ఎక్కడికి రావాలో ముఖ్యమంత్రి చెప్పాలి.
బుల్డోజర్ ఎక్కించి చంపుతా, తొక్కుతా, ఇష్టం ఉన్నట్లు మాట్లాడుడు కాదు రేవంత్ రెడ్డి నేను ఎక్కడికి రావా లన్న సిద్దం బహిరంగ సవాల్ చేస్తున్నా టీవీ చర్చ, సెక్రెటేరియట్, ఆల్ పార్టీ మీటింగ్ ఎక్కడికి రావా లో చెప్పు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని కేటీఆర్ చెప్పారు, నేనుకూడా చెప్పా ఎందుకు పెట్టలేదుపార్లమెంట్ ను తప్పుదోవ పట్టి స్తున్నావు, సోనియా గాంధీని తప్పుదోవ పట్టిస్తున్నావు మూసీ పునరుద్దరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, మూసీ ముసుగు లో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొల్లగొ ట్టటానికి వ్యతిరేకంమూసీ ప్రాజెక్టు ప్రారంభించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీఅవాస్తవాలు చెప్పడం మీద పార్లమెంట్ లో మా ఎంపీ సురేశ్, ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు.
నిరుపేదల పక్షాన న్యాయస్థానం వెళ్తాం. చట్టం ప్రకారం ఆ పేదలకు సాయం చేసేందుకు కృషి చేస్తంవచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రభు త్వాన్ని నిలదీస్తాంమూసీ బాధితులకు పూర్తి అండగా ఉంటామని, పోరాటం కొనసాగిస్తామని హామీ ఇస్తూ స్పష్టం చేశారు.
Brs harishrao