BRS HarishRao : హైకోర్టు ఉత్తర్వులతో ఇది డొల్లకేసని తేటతెల్లమైంది
-- మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు
హైకోర్టు ఉత్తర్వులతో ఇది డొల్లకేసని తేటతెల్లమైంది
— మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు
ప్రజా దీవెన, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్ర మంగా బనాయించిన కేసును పరిశీలించిన హైకోర్టు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు ఇ వ్వడం పట్ల మాజీమంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. దీంతో కేటీఆర్ తొలి అడుగులోనే నైతిక విజయం సాధించారని వారికి అభి నందనలని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పచ్చి అబ ద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నా డని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడారు.
ఈ కార్ రేసింగ్ మీద సభలో చర్చ జరపాలని అడిగామని, వాస్త వా లు ప్ర పంచానికి చెబుదామని, ప్రజలకు వాస్తవాలు తెలియాలని అడిగినందుకు, స్పీకర్ కు మొన్ననే కలిసి అడగితే ఈరోజు మమ్మ ల్ని బయ టకు పంపి సభలో చర్చ కొనసాగించారని ఆరోపించారు. కేసు పెట్ట వద్దు అని మేం అడగటం లేదు, చర్చ పెట్టండి అని అడిగా మని , ఎందుకు ఒప్పుకోలేదు, ప్రజలకు వాస్తవాలు తెలియవద్దా అని ప్రశ్నించారు.
ఫార్ములా-ఈ రేసులో రూ. 600 కోట్ల అవినీతి అంటూ సీఎం అస త్యాన్ని చెప్పే ప్రయత్నం చేశాడని, మిగతా 50 శాతం చెల్లిం చకపో వడం వల్ల రద్దు చేసుకుం టున్నాం, అందుకు అగ్రిమెంట్ రద్దు చేసు కుంటున్నం అని సదరు సంస్థ చెప్పిందని గుర్తు చేశారు.45 లక్షల పాండ్స్ అంటే సుమారు రూ. 47 కోట్లు కాని రేవంత్ రెడ్డి రూ. 600 కోట్ల నష్టం అంటున్నారు. మేం సభ లో లేకుంటే శుద్ధ తప్పులు చె ప్పిండని దుయ్యబట్టారు.వాస్తవానికి రూ. 700 కోట్ల లాభం రాష్ట్రా నికి జరిగిందని, రేవంత్ తుగ్లక్ పనుల వల్ల, పిచ్చి పని వల్ల రూ. 700 కోట్ల నష్టం రాష్ట్రానికి జరిగిందని విమర్శించారు.
ఫార్ములా-ఈ రేస్ నిర్వ హణ వల్ల ఆరేడు వందల కోట్లు హై దరాబా ద్‌కు మేలు జరిగింది అని 2022లో నీల్సన్ అనే ప్రఖ్యాత సం స్థ చెప్పిందని, రేవంత్ రెడ్డి మాటలు శుద్ధ అబద్ధం, రాష్ట్ర ఇమేజ్‌ని దెబ్బ తీసిండు రేవంత్ రెడ్డి అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అసలు కేటీఆర్ మీద కేసు ఎందు కు పెట్టారు,అవినీతి జరగలేదు, మరి ఏసీబీ కేసులు ఎందుకు పెట్టిం దని ప్రశ్నించారు.రాష్ట్ర ఖజానా నుంచి, నేషనల్ బ్యాంకు నుంచి ఆ సంస్థకు డబ్బులు పంపారని, ఇం దులో అవినీతి ఏముంది, ప్రొసీజు రల్ లాప్స్ జరిగినయి కావొచ్చు, అవినీతి లేదని తేలిపోయిందన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న అవినీతి జరగలేదని , ప్రొసీజురల్ లాప్స్ జరిగిందని అన్నడుని, వస్తు రూపేనా, ధన రూపేనా అవినీతి జరిగితే ఏసీబీ పని చేస్తదని, మే బీ ఇర్రెగ్యులారిటీ బట్ నాట్ ఇల్లీ గాలిటీ, 2022లో ఈవెంట్ జరిపితే 192 దేశాల ప్రజలు చూసారని, తెలంగాణ ఖ్యాతి పెరిగిందని గుర్తు చేశారు. రూ.42 కోట్లతో తమిళ నాడులో ఫార్ములా 4 నిర్వహించింది, ఉత్తర్ ప్రదేశ్ రూ. 1700 కోట్ల తో ఫార్ములా వన్ నిర్వహించింది, రూ. 103 కోట్లతో చంద్రబాబు 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించారని వివరించారు.
కాంగ్రెస్ ఢిల్లీలో కామ న్‌వెల్త్ గేమ్స్ రూ. 70 వేల కోట్లతో నిర్వహించా రని, అదొక స్కాం అని ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఏక్‌నాథ్ షిండే కేటీఆర్ అభినందించారన్నారు. అలవిగాని హామీలి చ్చి రేవంత్ ప్రజలను మభ్యపెట్టిండని, ముఖ్యమంత్రి అయితే అ య్యిండు గానీ, ఆయన ఇచ్చిన హామీలు ఎట్ల అమలు చెయ్యాలె అని తలుచుకొని భయప డుతున్నాడని, ఎట్లనన్న గట్టెక్కాలె, తిమ్మి ని బమ్మిని చెయ్యలె అనే ఆలోచనతో హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఏకంగా రాష్ట్ర మే దివాళా తీసిందనే దివాలాకోరు ప్రచారం మొదలుపెట్టిండని చెప్పారు.
రాష్ట్రం దివాల తీసింది అన్నడు. పెట్టుబడులు రావటం లేదు. దివా లా దివాలా అని తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డడని ఎద్దేవా చేశారు. ఏడు లక్షల కోట్ల అప్పు కాదు, నాలుగు లక్షల 17 వేల కోట్ల అప్పే అని శాసనసభ సాక్షిగా నోరు మూయించినమని తెలిపారు. గ్యారెంటీల గారడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిండని,రాష్ట్ర పరపతి, ప్రతిష్టను దెబ్బతీసిండని వెల్లడించారు. మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చారని, ఏడాది కాలంలో ఏం మార్పు వచ్చిం దని విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేతికి అధికార మార్పిడి తప్ప, ప్రజల జీవితాల్లో ఏం మార్పు వచ్చిందన్నారు.ప్రభుత్వం మీద గట్టిగ మాట్లాడితే చాలు కేసులు, ఇచ్చిన హామీలు ఏమైనయి అంటే చాలు అరెస్టులు రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన తెలిపినా నిర్బంధాలు కొనసాగు తున్నాయని ఆరోపించారు.
ఏం చేసిండు మా కేటీఆర్ నీ, అవినీతి బండారాన్ని సిస్టమేటిక్‌గా ఎప్పటిక ప్పుడు బయటపెడుతున్నడని, నీ స్కాంలను, నీ స్కీంలను ఆధారాల తో సహా ప్రజల ముందు ఉంచు తున్నడని అన్నారు. నీతో సహా నీ బ్రదర్స్, నీ అల్లుడు, నీ బామ్మర్ది బాగోతాలను బయటపెట్టి మీకు నిద్ర లేకుండా చేస్తున్నడని, ప్రజల భవిష్యత్తు గురించి కాదు, నీ ఆర్ఆ ర్ బ్రదర్స్ గురించే ఫోర్త్ సిటీ, ఫిఫ్త్ సిటీ అని ప్రజలకు అర్థమయ్యేలా వివరించిండని తెలిపారు.
మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో నువ్వు చే స్తున్న లూటిఫికేషన్‌ను బయటపెట్టిండని, ఇవన్నీ చేసిండు కాబట్టి, నీకు వశపడక. ఏదో ఒక కేసు పెట్టాలె, ఎట్లనైనా జైల్లో వేయాలనే కుట్ర కు కొన్ని నెలలుగా తెర లేపినవని విమర్శించారు. అరెస్టులతో లీడర్లను, క్యాడర్‌ను భయ బ్రాంతులకు గురిచేసి నీ కుంభ కోణాలను, లంబకోణాలను యథే చ్చగా కొనసాగించుకోవాలని చూస్తున్నవని ఆరోపించారు.
BRS HarishRao